లక్ష్మీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రిబ్కో ఎరువుల గోదాం

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎరువుల గోదాం ఏర్పాటు చేస్తున్నట్లు క్రిబ్కో అధికారులు ప్రకటించారు. గురువారం లక్ష్మీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహకార సంఘాన్ని అధికారులు సందర్శించి రైతులతో సమావేశమయ్యారు. జిల్లాలో ఎల్లవేళలా ఎరువులు అందుబాటులో ఉంచేందుకు లక్ష్మీపూర్ గ్రామ సొసైటీ, సహకార సంఘం ఆధ్వర్యంలో గోదాం ఏర్పాటుకు నిర్ణయించినట్లు చెప్పారు. లక్ష్మీపూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ చైర్మన్ పన్నాల తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ గంగయ్య, క్రిబ్కో మేనేజర్ ప్రేమ్ తేజ, రైతు సంఘ సభ్యులు పాల్గొన్నారు.