ఇసుంటోళ్ల మాటలకు కరిగిపోయి క్రెడిట్ కార్డు ఇచ్చారంటే ఇలానే జరుగుతుంది..

జగిత్యాల, వెలుగు: తల్లికి ఆరోగ్యం బాగాలేదని, భార్య అనారోగ్యం బారిన పడిందని నమ్మించి ఓ యువకుడు రూ.34 లక్షల మేర కాజేశాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని జామ్​బాగ్ కు చెందిన కళ్లెం ఆదిత్య ఓ సెల్  ఫోన్  స్టోర్​లో పని చేస్తున్నాడు. వివిధ కారణాలు చెబుతూ తెలిసిన వారి క్రెడిట్​కార్డులను స్వైప్​ చేస్తూ డబ్బులు కాజేశాడు.

మరికొందరితో కొత్తగా క్రెడిట్  కార్డు కోసం అప్లై చేయించి డబ్బులు డ్రా చేసుకున్నాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు శనివారం ఆదిత్య ఇంటి ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే డబ్బులు కాజేసిన ఆదిత్య రెండు నెలల నుంచి కనిపించడం లేదని బాధితులు తెలిపారు.