యూపీలోని ఫిరోజాబాద్‌లో ఘటన
ఫిరోజాబాద్(యూపీ): ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా 11 మందికి గాయాలు అయ్యాయి. నౌషేరా ప్రాంతంలోని బాణసంచా ఫ్యాక్టరీలో అర్ధరాత్రి అకస్మాత్తుగా పేలుడు జరిగింది. దీంతో భవనం గోడలు కూలిపోయాయి. చుట్టుపక్కల ఇండ్లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తామని తెలిపారు. ఇండ్ల పునర్నిర్మా నానికి ప్రభుత్వం సాయం చేయాలని మృతుల బంధువుల డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందిస్తామని షికోహాబాద్ ఎమ్మెల్యే ముకేశ్ వర్మ హామీ ఇచ్చారు.