రాములమ్మ మరణం పార్టీకి తీరని లోటు : తమ్మినేని వీరభద్రం

  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 

మునగాల వెలుగు : సీపీఎం సీనియర్ నాయకురాలు ములకలపల్లి రాములమ్మ మరణం పార్టీకి తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు మాతృమూర్తి ములకలపల్లి రాములమ్మ(95) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తమ్మినేని మునగాల మండలం కొక్కిరేణి గ్రామానికి వెళ్లి రాములమ్మ మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొక్కిరేణి గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన రాములమ్మ ఎన్నో కష్టాలు పడి తన కొడుకు రాములును చదివించారని తెలిపారు. రాములును సింగిల్ విండో డైరెక్టర్​గా, జడ్పీటీసీ, ఎంపీపీ, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, జిల్లా కార్యదర్శిగా తయారు చేశారని తెలిపారు. తన కొడుకును కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితం చేసిన గొప్ప నాయకురాలు రాములమ్మ అని కొనియాడారు. 

ఆమె ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నివాళులర్పించిన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మట్టి పెళ్లి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు 
ఉన్నారు.