‘డిండి’ చేపట్టేవరకు పోరాటం ఆగదు

చండూరు, వెలుగు: మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను ఆమోదించేవరకు పోరాటం ఆగదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శ్రీశైలం అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చండూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహారదీక్ష శనివారం రెండో రోజుకు చేరింది. 

సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ పాలమూరు-– రంగారెడ్డి ప్రాజెక్టుల మాదిరిగా ప్రభుత్వం ఇక్కడి ప్రాజెక్టులకు డీపీఆర్ అనుమతి ఇచ్చి అధిక నిధులు మంజూరు చేయాలని కోరారు. లేదంటే సీపీఎం ఆధ్వర్యంలో ఆదోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వెంకటేశం, నాయకులు ధనుంజయగౌడ్, లింగయ్య, స్వామి, బుగ్గయ్య, రాములు పాల్గొన్నారు.