ఎర్రజెండా పేద ప్రజలకు అండ : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

మణుగూరు, వెలుగు: ఎర్రజెండా పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పేదల హక్కుల కోసమే ఎర్రజెండా పార్టీలు నిరంతరం పోరాటాలు చేస్తున్నాయన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మణుగూరులో శనివారం ఏర్పాటు చేసిన సభకు ఆయన హాజరయ్యారు. రాష్ట్ర నాయకులు పాకాల పాటి పెద్దబ్బాయి, భాగం హేమంతరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, కార్యకర్తలతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఉత్సవాల్లో అతిథిగా పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగిన తనకు సీపీఐ పార్టీ నిరంతరం అండగా ఉందన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా ఓనమాలు దిద్దిన సీపీఐని మర్చిపోలేనన్నారు. కార్యక్రమంలో లీడర్లు షాబిర్ పాషా, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మి కుమారి, ఏఐటీయూసీ నాయకులు రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

పాల్వంచ: పట్టణంలోని అంబేద్కర్ సెంటర్​లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన కేక్ ఫ్యాక్టరీని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. కార్యక్రమంలో మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.