వేములవాడలో సీపీఐ ర్యాలీ

వేములవాడ, వెలుగు : సీపీఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేములవాడ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని మహకాళి ఆలయం నుంచి, మహాలక్ష్మీ వీధి వరకు వేములవాడ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కడారి రాములు ఆధ్వర్యంలో  ర్యాలీగా నిర్వహించి జెండా ఎగుర వేశారు.  

దేశానికి, ప్రజాస్వామ్యానికి కమ్యూనిస్టుల అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో  వేణు, అనసూయ, రవీందర్, దేవరాజ్, నర్సయ్య, మల్లేశం పాల్గొన్నారు.