ఇరిగేషన్ కెనాల్ కబ్జాపై అధికారులు స్పందించాలి

  • సీపీఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్​చార్జి రాములు

కోటగిరి, వెలుగు : కోటగిరి బస్టాండ్ పక్కనగల నిజాంసాగర్ ఇరిగేషన్ కెనాల్ సరిహద్దు స్థలం కబ్జాపై ఇరిగేషన్ అధికారులు స్పందించాలని సీపీఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్​చార్జి  దుబాస్ రాములు డిమాండ్ చేశారు.  స్థలం కబ్జాచేసారని తెలియడంతో  గురువారం  కబ్జా  చేసిన స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. కోటగిరి బస్టాండ్ కు ఆనుకుని ఉన్న ఇరిగేషన్ కెనాల్ సరిహద్దు స్థలాన్ని కబ్జా చేస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాదాపు నెల రోజులుగా సరిహద్దు  స్థలంలో ఉన్న భారీ వృక్షాలను నరికేసి గోడ కట్టినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వెంటనే కెనాల్ బౌండ్రీలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని, లేదంటే సీపీఐ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

కబ్జా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్,  నాయకులు బుడాల రాములు, రాజు, కప్ప హనుమాండ్లు, శివరాజ్, నారాయణ, నీలి శంకర్ తదితరులు పాల్గొన్నారు.