డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌లో అప్రమత్తంగా ఉండాలి : సీపీ ఎం.శ్రీనివాస్​

గోదావరిఖని, వెలుగు: నిర్లక్ష్య డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌తో జీవితాలను రోడ్డుపాలు చేయొద్దని, డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌లో అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్​ సూచించారు. శుక్రవారం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ల పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పోలీస్​ ఆఫీసర్ల వెహికిల్స్​ డ్రైవర్లుగా డ్యూటీ చేస్తున్న పోలీస్​ సిబ్బందికి అవగాహన కల్పించారు. సీపీ మాట్లాడుతూ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వాహనాలను ఎప్పటికప్పుడు కండిషన్​లో ఉంచుకోవాలన్నారు. 

వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్​లో మాట్లాడవద్దని, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించొద్దన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ ఎంటీవో మధు, ఆర్ఐలు మల్లేశం, శ్రీనివాస్, ఎంవీఐ మధు, ఆర్ఎస్ఐలు  పాల్గొన్నారు.