హెల్మెట్ పెట్టుకోకపోతే కేసులే : సీపీ కల్మేశ్వర్

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్, బోధన్ డివిజన్లలో ఆగస్టు 15వ తేదీ తర్వాత ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సీపీ కల్మేశ్వర్ సూచించారు.  వాహనాలు రాంగ్ రూట్లో వచ్చినా, నంబర్ ప్లేట్ లేని  వాహనాలకు, మైనర్లు వాహనం నడిపినా కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.  ప్రస్తుతం నగరంలో ప్రధాన కూడలి వద్ద నంబర్ ప్లేట్ లేని వాహనాలకు,  రాంగ్ రూట్లో వచ్చిన వాహనాలకు  జరిమానా విధిస్తున్నామని పేర్కొన్నారు.

- వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్