కరీంనగర్ క్రైం,వెలుగు: పోలీస్ అధికారులకు, సిబ్బందికి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు నిర్వహించినట్లు కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి తెలిపారు. బుధవారం కమిషనరేట్‌లో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ ఎంపిక కోసం కమిషనరేట్లు, జిల్లాల వారీగా డ్యూటీ మీట్ పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ , క్రైమ్ ఇన్వెస్టిగేషన్–చట్టాలు , మెడికో లీగల్ టెస్ట్ , ఫింగర్ ప్రింట్ సైన్స్ , క్రైమ్ సీన్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, క్రైమ్ సీన్ పరిశీలన తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించామని తెలిపారు.
విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలి.
జగిత్యాల టౌన్, వెలుగు: పోలీసులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. బుధవారం జిల్లాకు కేటాయించిన ఎస్సైలు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్పీ ఆఫీసులో పోలీస్ అధికారులకు, సిబ్బందికి జిల్లా స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీలు రవీంద్ర కుమార్, రంగారెడ్డి, సీఐలు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.