లేగదూడ పై చిరుత దాడి..తరిమిన ఆవులు

  • దూడను కాపాడుకునేందుకు తిరగబడ్డ ఆవులు

లింగంపేట, వెలుగు : లేగదూడపై దాడిచేసిన చిరుతపులిపై ఆవులు తిరగబడడంతో అది పారిపోయిన సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఎక్కపల్లితండా శివారులో గురువారం సాయంత్రం జరిగింది. ఎక్కపల్లి తండాకు చెందిన రైతు మాలోత్​ మోహన్​ తనకున్న 70 ఆవులను మేతకోసం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆవులను ఇంటికి తోలుకొస్తుండగా మార్గం మధ్యలో చిరుత పులి లేగదూడపై దాడిచేసింది. 

తన దూడను కాపాడు కునేందుకు తల్లి ఆవు చిరుతపులిపై తిరగబడింది. దీంతో మిగతా ఆవులు చిరుతను చుట్టు ముట్టడంతో చిరుత భయపడి లేగ దూడను వదిలి పారిపోయినట్లు  మోహన్ చెప్పాడు.  చిరుతను బందించాలనీ ఫారెస్ట్​ ఆఫీసర్లను తండావాసులు కోరుతున్నారు.