కరోనా..ఆ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 68 దేశాల్లోని ప్రజలు మితిమీరిన యాంటీ బయాటిక్స్ మందులు తీసుకున్నారు. ముఖ్యంగా ఇండియాలో అయితే అధిక మోతాదులోని యాంటీ బయాటిక్స్ మందుల వినియోగం..ఇప్పుడు క్రమంగా మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంట..
కొంత కాలంగా అనారోగ్యం బారిన పడి.. ఆస్పత్రుల్లో చేరుతున్న రోగులకు.. డాక్టర్లు సహజంగా యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారు. అయితే ఆ మందు ఇప్పుడు పెద్దగా వారిపై ప్రభావం చూపించటం లేదంట.. సహజంగా ఏ వ్యాధికి అయినా కొంత పవర్ వరకు ఉన్న యాంటీ బయాటిక్స్ ఇస్తారు. ఇప్పుడు డాక్టర్లు అలా ఇస్తు్న్నా.. ఆ యాంటీ బయాటిక్స్ మందులు పని చేయటం లేదంట. దీనిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు..అసలు విషయాన్ని గుర్తించారు.
కరోనా సమయంలో అధిక మోతాదులో యాంటీ బయాటిక్స్ తీసుకున్న రోగులకు.. ఇప్పుడు అధిక పవర్ ఉన్న మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుందంట.. దీనికితోడు శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి కూడా క్షీణించిందని.. దీని అంతటికీ కారణం కరోనా టైంలో.. అధిక మోతాదులో యాంటీ బయాటిక్స్ తీసుకోవటం వల్లే అని డాక్టర్లు చెబుతున్నారు.
గత ఆరు నెలల్లో 4 లక్షల 50 వేల మంది పేషెంట్లను పరిశీలించగా ఈ విషయం బయటపడినట్లు స్పష్టం చేస్తున్నారు.