అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రతిష్ఠ జరగబోతున్న టైంలో... బాలరాముడు ఎలా ఉంటాడు? రూపు రేఖలు ఎలా ఉంటాయి? చూడాలన్న ఆసక్తితో కొన్ని లక్షల మంది ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో కొలువుదీరనున్న బాల రాముడి మందిరం కోసం రాజస్తాన్ నుంచి రాళ్లు.. హైదరాబాద్ నుంచి తలుపులు... విదేశాల నుంచి మట్టి, నీళ్లు... ఇలా ఎన్నో సంస్కృతులను ఒక దగ్గరకు చేరుస్తున్నట్టే కనిపిస్తోంది. అంగరంగవైభవంగారామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య రామ మందిరం గురించి వివరాలతో ప్రత్యేక వ్యాసాలు.
ఆలయ వివరాలు
చీఫ్ ఆర్కిటెక్ట్స్: చంద్రకాంత్ సోంపుర, అతని ఇద్దరు కొడుకులు నిఖిల్ సోంపుర, ఆశిష్ సోంపుర.
డిజైన్ అడ్వైజర్స్: ఐఐటీ గౌహతి, ఐఐటీ చెన్నై, ఐఐటీ బాంబే, ఎన్‌ఐటీ సూరత్, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రూర్కీ, నేషనల్ జియో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్.
నిర్మాణ సంస్థ: లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ)ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీ:టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (టీసీఈఎల్)
శిల్పులు: అరుణ్ యోగిరాజ్ (ఎంపికైన విగ్రహం), గణేష్ భట్, సత్యనారాయణ పాండే
ఆలయ వివరాలు
మొత్తం ఏరియా: 70 ఎకరాలు (70శాతం గ్రీన్ ఏరియా)
టెంపుల్ ఏరియా: 2.77 ఎకరాలు
నిర్మాణ విస్తీర్ణం: 57,400 చదరపు అడుగులు
ఆలయం పొడవు: 380 అడుగులు
ఆలయం వెడల్పు: 235 అడుగులు
ఆలయ శిఖరం ఎత్తు: 161 అడుగులు
నిర్మాణ శైలి: నగార స్టైల్
ఆర్కిటెక్చరల్ హైలైట్స్: 3 అంతస్తులు392 స్తంభాలు44 తలుపులు
ఆలయ వివరాలు
శంకుస్థాపన: 5.08.2020
మందిరం నిర్మాణం సంపూర్ణమయ్యేది (అంచనా): 2026
గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఎత్తు: 51 అంగుళాలు
భక్తులకు దర్శనం ఇచ్చే దూరం: 35 అడుగులు
రామ మందిరానికి అయిన ఖర్చు: 400 కోట్లుకాంప్లెక్స్ నిర్మాణానికి
అయ్యే ఖర్చు అంచనా: 1,800 కోట్లు జూన్, 2022 నాటికి ట్రస్ట్‌కు
వచ్చిన విరాళాలు: 3,400 కోట్లు