కోర్టు తీర్పులు

నాజ్​ ఫౌండేషన్​ వర్సెస్​ ఎన్​సీటీ ఢిల్లీ (2009) : ఐపీసీలోని 377 సెక్షన్ ప్రకారం పరస్పర అంగీకారంతో సోడోమిని/ స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించడం ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్స్ 14, 15, 19, 21  ఆయా వ్యక్తుల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సురేశ్​​ కుమార్​ కౌశల్​ వర్సెస్ నాజ్​

ఫౌండేషన్​ (2013) : ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్​ బెంచ్​ నాజ్​ ఫౌండేషన్​ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు తప్పు పట్టింది. సోడోమి లేదా హోమో సెక్సువాలిటీని నేరంగా పేర్కొన్నది. సమాజంలో ఎల్​జీబీటీ వర్గం అల్ప సంఖ్యలో ఉంటారని పేర్కొంది. 

నల్సా వర్సెస్ యూనియన్​ ఆఫ్​ ఇండియా (2014) : ఈ కేసులో ట్రాన్స్​జెండర్లను థర్డ్​ జెండర్లుగా పిలవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఒక వ్యక్తి ఎలాంటి జెండర్ గా ఉండాలనేది ఆ మనిషి స్వయం నిర్ణయాధికారానికి సంబంధించిందని పేర్కొంది. ప్రాథమిక హక్కులు స్త్రీ, పురుషులతో సమానంగా థర్డ్​ జెండర్​ వర్గం వారికీ వర్తిస్తాయని పేర్కొంది. మూడో లింగం వారి హక్కుల గుర్తించడంతోపాటు వారి రక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 

కేఎస్​ పుట్టస్వామి వర్సెస్​ యూనియన్​ ఆఫ్​ ఇండియా (2017) : ఎలాంటి లైంగిక జీవనం కలిగి ఉండాలి లేదా ఎలాంటి లైంగికతను అనుసరించాలి అనే  విషయం వ్యక్తిగత గోప్యత కిందకి వస్తుందని తెలిపింది. ఈ విషయం అధికరణం 21 పరిధిలోకి వస్తుందని, ఎలాంటి సెక్సువల్​ ఓరియంటేషన్​ కలిగి ఉండాలో ఆయా వ్యక్తుల ఇష్టాలను అనుసరించే వారికీ ప్రాథమిక హక్కు ఉంటుందని తెలిపింది. సెక్సువల్​ ఓరియంటేషన్​పై వివక్షతను లేదా విద్వేషం కలిగి ఉండటం ఆర్టికల్స్​ 14, 15, 21ల ఉల్లంఘనే అని తెలిపింది. 

నవ్​జోత్​ సింగ్​ జోహార్​ వర్సెస్ యూనియన్​ ఆఫ్​ ఇండియా(2018) : ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం మేజర్లు అయిన ఇద్దరు వ్యక్తుల మధ్య అనుమతితో కూడిన వ్యక్తిగత స్వలింగ సంపర్క సంబంధాలు నేరం కాదని తెలిపింది. ఐపీసీ 377లోని అన్​ నేచురల్​ సెక్స్​ అనే అంశంలో భాగమైన స్వలింగ సంపర్కం లేదా సోడోమిని నేరంగా ప్రకటించే సెక్షన్​ను రద్దు చేసింది. 

అరుణ్​కుమార్​ వర్సెస్ ఇన్​స్పెక్టర్​ జనరల్​ ఆఫ్​ రిజిస్ట్రేషన్​ (2019) : పురుషుడికి, ట్రాన్స్​ ఉమెన్​కు మధ్య జరిగే వివాహం చెల్లుతుందని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

షాఫిన్​ జెహన్​ వర్సెస్​ కేఎం అశోకన్​( 2018) : జీవిత భాగస్వామిని ఎంచుకోవడం వ్యక్తి ప్రాథమిక హక్కు అని, అది సేమ్​ సెక్స్​ పార్టనర్​ అయినా సరే వారి ఇష్టం అని అభిప్రాయపడింది.