బాబా ఆలయ హుండీ లెక్కింపు

నిజామాబాద్ రూరల్,  వెలుగు : నగర శివారులోని మాధవనగర్‌‌లోని ప్రముఖ సాయిబాబా ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.  దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో గడిచిన 89 రోజులకు రూ.1,92,549 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ రవీందర్‌‌ గుప్తా తెలిపారు.  ఈ మొత్తాన్ని ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేశామన్నారు.  త్వరలో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా ఈ రోజు హుండీ లెక్కించామని ఆయన తెలిపారు.