కాశ్మీర్లో కౌంటింగ్ రేపే..భారీ బందోబస్తు

  • రేపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు  

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లో మంగళవారం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 20 కౌంటింగ్ సెంటర్ల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 

కౌంటింగ్ డ్యూటీ స్టాఫ్, ఏజెంట్స్​ను మాత్రమే లోపలికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. కాగా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు 3 విడతల్లో ఇటీవల పూర్తయ్యాయి. మొత్తం 90 సీట్లకు గాను 873 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.