నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నిజామాబాద్ నగరంలోని ట్రాన్స్ జెండర్ లకు రెండో టౌన్ ఎస్ హెచ్ ఓ రామ్ ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులకు ఇబ్బందులు గురిచేస్తూ న్యూసెన్స్ సృష్టించడంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. నగరంలోని ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సిగ్నల్ పడగానే వాహనదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
డబ్బులు ఇవ్వని పక్షంలో వాళ్లని బూతులు తిడుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో రెండో టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారిపై కేసు నమోదు చేశారు. మళ్లీ ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తానని వారిని హెచ్చరించారు.