తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ పత్తి కొనుగోళ్లు బంద్‌‌ : బొమ్మినేని రవీందర్‌‌రెడ్డి

కాశీబుగ్గ, వెలుగు : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పత్తి కొనుగోళ్లు బంద్‌‌ చేస్తున్నట్లు కాటన్‌‌ అసోసియేషన్‌‌ అండ్‌‌ ఇండస్ట్రీస్‌‌ ప్రెసిడెంట్‌‌ బొమ్మినేని రవీందర్‌‌రెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ కాటన్‌‌ కార్పొరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా ఎల్​1, ఎల్2, ఎల్3 పేరుతో పెట్టిన రూల్స్‌‌తో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ఈ రూల్స్‌‌కు వ్యతిరేకంగా నేడు నిర్వహించే పత్తి కొనుగోళ్ల బంద్‌‌కు కాటన్‌‌ జిన్నింగ్‌‌ అండ్‌‌ ప్రెస్సింగ్‌‌ ఇండస్ట్రీస్‌‌ యజమానులు సహకరించాలని కోరారు. రైతులెవరూ తమ పత్తిని జిన్నింగ్‌‌ మిల్లులకు, మార్కెట్‌‌కు తీసుకురావొద్దని సూచించారు.