Good Food : కొత్తిమీరతో కోటి లాభాలు.. ఈ స్టోరీ చదివితే మీరు రోజూ తింటారు..!

వందల రూపాయలు పెట్టి మాంసం తెచ్చుకుంటాం... చివర్లో కాసింత కొత్తిమీర వేస్తే... టేస్ట్ అదిరిపోతుంది. మాంసంలోనే కాదు.. ఏ కూరలో అయినా.. చివర్లో కాస్త కొత్తిమీర యాడ్ చేస్తే.. ఆ ఫ్లేవర్​ కి  నోట్లో నీళ్లూరుతాయి. అంత టేస్ట్ కొత్తిమీరది. కేవలం రుచిని పెంచడంలో మాత్రమే కాదండేయ్.. ఆరోగ్యం విషయంలోనూ కొత్తిమీర ముందే ఉంటుంది.

మార్కెట్​కు వెళ్లి కూరగాయలన్నీ కొన్నాక  చివర్లో ఓ నాలుగు కట్టల కొత్తిమీర కొనడం మర్చిపోరు ...వంట రుచి పెంచడానికి అదొక ఆయుధం. ..అయితే అనారోగ్య లక్షణాలను తరిమికొట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజాలను చేకూర్చే లక్షణాలు కొత్తిమీరలో పుష్కలంగా ఉన్నాయి. రుచిని పెంచుతూ.. ఆరోగ్యాన్ని కాపాడే కొత్తిమీర డైలీఫుడ్​ లో ఉండేలా చూసుకుంటే.. ఆరోగ్యానికి రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నట్లే.

రోజువారీ వంటకాలలో సువాసన కోసం కొత్తిమీరను వాడుతుంటాం. దీని ద్వారా కూరలకు మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాదు, కొత్తిమీరను కూరలా వండుకున్నా లేదా పచ్చడిగా చేసుకున్నా అద్భుతంగా ఉంటుంది. అయితే నిజానికి కొత్తిమీరను కొన్ని వేల సంవత్సరాల కిందటే వినియోగంలోకి తెచ్చారు. ఈ మొక్క మంచి వాసనను ఇస్తుంది. కొత్తిమీరలో మన శరీరానికి పనికొచ్చే ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లు, లవణాలు, లోహాలు ఉంటాయి.

ALSO READ : Good Health: దీని దుంప తెగ.. ఇది తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

కొత్తిమీర త్రిదోషాలను హరిస్తుందంటారు. శరీరంలోని వాతం, పిత్తం, కఫం లోని అసమానతలు తొలగించడంలో కొత్తిమీర ముందుంటుందని ఆయుర్వేదం చెప్తుంది. నిత్యం వంటల్లో కొత్తిమీరను వాడడం... కొత్తిమీర జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణ సమస్యలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కొత్తిమీర జ్యూస్ ను ఉదయాన్నే పరగడుపునే తాగితే జీర్ణ సమస్యలు, అసిడిటీ, మలబద్దకం  తగ్గుతాయి.  కొత్తమీర జ్యూస్​రోజూ తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. 

జ్వరం వచ్చినప్పుడు కొత్తిమీర జ్యూస్ తాగితే చాలా తొందరగా ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీరలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు అన్ని రకాల జ్వరాలను తగ్గించడానికి పనిచేస్తాయి. కిడ్నీలకు సంబంధించి సాధారణంగా యూడినో బ్లాడర్ సమస్యలు, కిడ్ని దెబ్బ తిన్నప్పుడు క్రియాటిన్​ లెవెల్​ పెరగడం, కిడ్నీ పనితీరు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటి నుండి ఉపశమనం పొందాలంటే, కొత్తిమీర కషాయం తీసుకోవాలి.

కొత్తిమీరలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొప్యు పదార్థాలను సమన్వయ  -పరుస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వును పెంచి .. అనవసర కొవ్వును  కరిగిస్తుంది. కంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. ముఖం మీద ఏర్పడే మొటిమలు,నల్లమచ్చలకు కొత్తిమీర ప్యాక్ చాలా ఉపయోగపడుతుంది. కొత్తిమీర ఆకులను పేస్ట్​ లా చేసి ముఖానికి రాసుకుంటే మచ్చలు తొలిగిపోతాయి. 

ALSO READ : Good Health:రోజూ 3 కప్పుల బ్లాక్ కాఫీ.. షుగర్ కంట్రోల్.. గుండె జబ్బులకు చెక్..!

కొత్తిమీరలోని ఎసెన్షియల్  అయిల్స్ ఒత్తిడిని, తలనొప్పిని తగ్గిస్తాయి. షుగర్ తో బాధపడేవారికి కొత్తిమీర మంది ఔషధం .  కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ పెంచి ...రక్తంలోని చక్కెర స్థాయిల్ని తగ్గిస్తుంది. ఇందులోని ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. అమ్మవారు (పొంగు Chickenpox) పోసినప్పుడు రోజుకో గ్రాను చొప్పున కొత్తిమీర రసాన్ని వారం రోజుల పాటు పట్టిస్తే మచ్చలతో సహా తగ్గిపోతుంది. కొత్తిమీర రసాన్ని అల్మండ్ ఆయిల్ తో కలిపి దురద, దద్దుర్ల మీద రాస్తే..క్షణాల్లో ఉపశమనం లభిస్తుంది


 కొత్తిమీర గురించి ముఖ్యమైన విషయాలు

  •  కొత్తిమీర శాస్త్రీయ నామం: కొరియాండ్రమ్ సాతివమ్. దీన్నే చైనీస్ పార్ల్పీ  అని కూడా పిలుస్తాడు.
  •  క్రీ.పూ 2000 సంవత్సరాల నుంచి కొత్తిమీరను ఆహార పదార్థంగా వాడుతున్నారు. అంతకు ముందు పశువులకు మేతగా వేసేవారట.
  •  ప్రపంచంలో కొత్తిమీరను ఎక్కువగా తినేవారు చైనీయులు మాత్రమే
  •  కొత్తిమీర దాదాపు 20 అంగుళాల ఎత్తు వరకు పెరుగుతుంది.
  •  కొత్తిమీర పూలు చాలా చిన్నగా తెలుపు లేదా లేత ఉదా రంగులో పూస్తాయి. కొన్నిప్రాంతాల్లో కొత్తిమీర పూలకు సుగంధ కోసం వాడుతారు.
  •  కొత్తిమీరలోని అన్ని భాగాలు వాడుకోవచ్చు. కొత్తిమీర ఆకులు.. గింజలు, కాడలు అన్ని వంటల్లో వాడొచ్చు.
  •  కొత్తమీర ఫ్రెష్ గా, ఎండబెట్టి .. రుబ్బి  పొడిగా కూడా వాడతారు. వేడి చేసినపుడు కొత్తిమీర సువాసన పోతుంది. కనుక  వంటలు వండాక కొత్తిమీర చల్లుతారు.
  •  కొత్తిమీరలో ఉండే కొన్ని రకాల కెమికల్స్ వల్ల ఆహారం తొందరగా పాడవదు.
  •  బెల్జియంలో కొన్ని రకాల బీర్లలో సువాసన కోసం కొత్తమీర వాడతారు. 
  •  సూప్, సలాడ్​,  ఆమ్లెట్ , రైస్​,  మాంసంలలో తప్పనిసరిగా కొత్తిమీరను వాడతారు
  •  పెదవులు నల్లగా ఉన్నవారు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసాన్ని పెదవుల మీద రాస్తే పెదాలు నల్లరంగు నుంచి మామూలు రంగుకు మారతాయి.
  •  కడుపు ఉబ్బరంగా ఉంటే రెండు కొత్తిమీర ఆకులు నమిలితే చాలు..
  •  మార్కెట్లో కొత్తిమీర కొనకుండా ఒక పూలకుండీలో కాసిన్ని ధనియాలు చల్లితే చాలు... కొత్తిమీర మీ ఇంట్లోనే పండుతుంది..

–వెలుగు, లైఫ్​–