Health News: గుండెను ప్రేమించండి.. చల్లంగా పది కాలాలు ఉండండి...

ప్రేమ పదికాలాలు నిలవాలంటే ఏం చేయాలి? అంటే వేదాంతులు ఎన్నో చెబుతారు. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఒక్కటే చెబుతోంది. ఆ ఒక్కటి ఆచరిస్తే మీ ప్రేమకు ఢోకాలేదంటోంది. ఇంతకూ  ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఏంచెప్పిందో తెలుసుకుందాం. . . 

 ప్రేమించే వాళ్లకు గుండెల్లో గుడి కడతారు. మరి ప్రేమ గుడిని మోసే గుండెను కూడా  కాస్త ప్రేమించందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరికీ ప్రేమతో ఓ సలహా ఇస్తోంది. ఓస్​  ఇంతేనా.. . అనుకోకండి. ప్రేమించే వాళ్ల ఇష్టాలకు అనుగుణంగా మీ ఇష్టాలను మలచుకుంటారు. వాళ్ల అభిరుచులకు తగ్గట్టు మిమ్మల్ని మీరే మార్చుకుంటారు. 

అయితే  ఆ ప్రేమను నింపుకున్న గుండెకూ కొన్ని కష్టాలున్నాయి. దానిని కష్టపెట్టకుండా చూడండి. అందుకే గుండెను ప్రేమించడం కూడా అలవాటు చేసుకోండంటున్నారు నిపుణులు.

ALSO READ | Health News : భరించలేని తలనొప్పా.. ఓ 10 సెకన్లు ఇలా ట్రై చేయండి.

గుండెను ప్రేమించడమంటే ఏం చేయాలి? అంటే.. మీ అలవాట్లను దాని కోసం మార్చుకోవాలట. గుండె ఆరోగ్యం కోసం మీ జీవనశైలిని కూడా కొంచెం మార్చుకుంటే అది ఆరోగ్యంగా ఉంటుంది. అందుకోసం రోజూ ఆరు విషయాలపై తప్పకుండా దృష్టి పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది.

  •  గుండెకు ముప్పు తెచ్చే ఉప్పుని తగ్గించాలి. 
  • రోజూ హెల్తీ డైట్ తీసుకోవాలి. 
  • ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఫిజిక్ని మార్చుకోవాలి. 
  • పొగ తాగడం మానేయాలి. 
  • ఆల్కహాల్ తాగే అలవాటుంటే పరిమితంగా తాగాలి. 
  • రోజూ వ్యాయామం చేయాలి.
  •  ఈ ఆరు అలవాట్లు ఉంటే చాలు. గుండెకు ఎప్పటికీ నొప్పిరాదు. మీరు ప్రేమించేవాళ్లకు ఏ ముప్పు రాదు