Cooking Tips : ఈ కూరగాయలను ఇలాగే వండాలి.. లేకపోతే తిన్నా వేస్ట్.. బలం ఉండదు.. !

రుచిగా ఉండాలంటే బాగా వండాలి.. అలా అని కొన్ని కూరగాయలను పద్ధతి ప్రకారం వండకపోతే వాటిలోని పోషకాలు నశిస్తాయి. కాబట్టి వెజిటబుల్స్ తో పాటు మాంసం వండే విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి.

ఆలుగడ్డలు :

ఆలుగడ్డలను చిన్న ముక్కలు కోసి ఉడికించకూడదు. అలా చేస్తే వాటిలోని పోషక విలువలు పోతాయి. అందుకే అలూని బాగా కడిగి సగానికి కోసి పొట్టుతో పాటు ఉడికించాలి. అలా చేయడం వల్ల దుంపల పొట్టులో ఉండే పీచు పోకుండా పోషకాలు అందుతాయి.

క్యాబేజీ :

చాలామంది క్యాబేజీని ఉడికించి కూర చేస్తారు. అయితే అలా ఉడికించినప్పుడు శరీరానికి మేలు చేసే గుణాలన్నీ వృథాగా పోతాయి. అందుకే క్యాబేజీ ఉడికించేటప్పుడు నీళ్లలో నూనె లేదా కాస్త వెన్న వేస్తే పోషకాలు పోవు. అదేవిధంగా క్యాబేజీని ఎక్కువగా ఉడికించినా, వేగించినా సల్ఫర్ విడుదలై రుచి మారిపోయే ప్రమాదముంది.

ఉల్లిపాయలు :

సలాడ్స్, బర్గర్స్, శాండ్విచ్ లాంటి వాటిల్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేస్తుంటాం. నిజానికి ఇది మంచి పద్ధతి. పచ్చి కూరగాయల్లో సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు జీవక్రియలను మెరుగుపరుచుతుంది. 

మాంసం, చేపలు:

మాంసం, చేపలను ఎక్కువ మంట మీద ఉడికిస్తే వాటిలో ఉండే మాంసకృత్తులు పోతాయి. అదేవిధంగా ఆరోగ్యానికి హాని చేసే కార్సినోజెనిక్ కాంపౌండ్లు, హెటిరోసైకిల్ అమైన్స్ విడుదలవుతాయి. కాబట్టి తక్కువ మంట మీద ఉడికిస్తే ఉత్తమం

=V6 వెలుగు, లైఫ్