Good Health:ఆరోగ్యం అని బాదం ఎక్కువగా తింటున్నారా..ఈ సైడ్ ఎఫెక్ట్ వస్తాయి జాగ్రత్త..!

బాదం..ఇవి మన ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరమో మనందరికి తెలుసు.. ఈరోజుల్లో హెల్త్ కాన్షియస్ ఉన్న ప్రతి ఒక్కరూ.. ఆరోగ్యం కోసం, ఫిట్ నెస్ మెయింటెన్ కోసంకాజు, బాదం పప్పులు తింటున్నారు. డైటీషియన్లు, డాక్టర్లు కూడా వీటిని తినాలని సూచిస్తున్నారు. మరి బాదం పప్పులు ఎక్కువగా తినొచ్చా.. తింటే ఆరోగ్యంపై ఏదైనా చెడు ప్రభావం ఉంటుందా..?  బాదం పప్పులు ఏ మోతాదులో, ఎలా తీసుకోవాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. 

గతంలో బాదం పప్పులు వాడకం తక్కువగా ఉండేది..డ్రై ఫ్రూట్స్, బాదం, కాజు లాంటివి సామాన్యులకు అందుబాటులో ఉండేవి కావు.. ఎందుకంటే వాటి రేట్లు ఎక్కువ, వాటి ఉత్పత్తి తక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు మధ్య తరగతి కుటుంబాల్లో కూడా డ్రైఫ్రూట్ వాకడం ట్రెండ్ గా ఉంది. ముఖ్యంగా వింటర్ సమయంలో కాజు, బాదం తింటున్నారు. బాడీ ఫిట్ గా ఉండాలన్నా.. సీజనల్ వ్యాధులతో ఇతర రోగాలను ఎదుర్కునే పోషకాలుండే శక్తివంతమైన డైట్ తీసుకోవాలని డాక్టర్లు , డైటీషియన్లు కూడా చెబుతున్నారు. కానీ బాదం అధికంగా తింటే సీరియస్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. 

బాదం పప్పులు ఎక్కువగా కలిగే సైడ్ ఎఫెక్ట్స్..

అలర్జీ.. 

మీకు ఏదైనా రకమైన అలెర్జీ ఉంటే.. బాదంపప్పులు గానీ, వాల్ నట్స్ గానీ తీసుకోవడంలో జాగ్రత్త తీసుకోవాలి. అలర్జీ ఉన్నవారు బాదం పప్పులను కూడా తినకూడదు. గొంతు నొప్పి, నోటిలోని కుహరంలో దురద, పెదవులు లేదా నాలుక వాపు , బుగ్గలలో వాపు వంటి అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. 

బరువు పెరిగే అవకాశం.. 

బాదం ఎక్కువగా తింటే.. బరువు తగ్గుటకు బదులుగా లావెక్కే అవకాశం ఉంది. బాదంలో అధిక క్యాలరీలు ఉంటాయి. 1 ఔన్స్ బాదం లో 160 క్యాలరీల శక్తి ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు బాదం వినియోగంలో జాగ్రత్త వహించాలి. 

మలబద్దకం.. 

బాదంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రేగుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. జీర్ణాశయం ఆరోగ్యాన్ని పెంచుతుంది. అయితే ఎక్కువగా బాదం తినడం వల్ల లాభాలకంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు డైటీషీయన్లు. కొన్నిసార్లు బాదం అధికంగా తినడం వల్ల మలబద్ధకానికి కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. 

కిడ్నీలో రాళ్లు.. 

మీ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లయితే బాదం తినడం మానేయాలి. బాదంలో ఆక్సాలేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్ల సమస్యను పెంచుతాయి. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఉన్నా.. వస్తాయని అనుమానం ఉన్నా బాదం పప్పులు తినడంలో జాగ్రత్త వహించాలి. 

గ్యాస్, గుండెలో మంటకు కారణంగా.. 

కడుపులో గ్యాస్ సమస్య ఉన్నవాళ్లు..గ్యాస్ట్రోసోఫాజికల్ రిఫ్లెక్స్ వ్యాధి ఉన్నవాళ్లు బాదం తక్కువగా తినాలి. ఎక్కువగా బాదం తింటే గుండెలో మంట సమస్యకు దారి తీయొచ్చు. సో బీకేర్ ఫుల్.. 

రక్తస్రావం.. 

బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తాన్ని గడ్డకట్టకుండా చేస్తుంది. ఈ క్రమంలో బాదంపప్పులు ఎక్కువగా తిన్నప్పుడు రక్త గడ్డ కట్టడాన్ని అడ్డుకుంటుంది.. ఫలితంగా రక్తస్రావం సమస్య ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఏదైనా దెబ్బ తాగినప్పుడుగానీ, ఆపరేషన్ సమయంలో గానీ రక్తస్రావం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. 

రోజులో ఎన్ని బాదం పప్పులు తినాలి..

ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజులో 5నుంచి 6 బాదంపప్పులు తింటే చాలు. ఇక ఆరోగ్యంకోసం వర్కవుట్స్ చేసే వారు.. 8నుంచి 10 బాదం పప్పులు తినొచ్చు.  బాదం పప్పులను రాత్రి నానబెట్టి పొద్దునే తింటే ఎక్కువ ఆరోగ్యకరమైన లాభాలు పొందవచ్చు.