అయోధ్యలో రామాలయం నిర్మాణం ఇలా మొదలు

సుప్రీం కోర్టు ఆర్డర్​ తరువాత ఫిబ్రవరి, 2020న సోంపురాను టెంపుల్​ డిజైన్​ కన్సల్టెంట్​గా ఎంపిక చేశారు. ఆ ఎంపిక పూర్తయ్యాక  హిందూ గ్రంథాలు, వాస్తు, శిల్ప శాస్త్రాల ప్రకారం ఒరిజినల్ నుండి కొన్ని మార్పులతో కొత్త డిజైన్‌ను సిద్ధం చేశారు సోంపురా.

మందిరం నిర్మాణానికి ఎల్​ అండ్​ టీని కన్​స్ట్రక్టింగ్ ఏజెన్సీగా నియమించారు. అందరూ కలిసి మరో వెయ్యేండ్లు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మించాలి అనుకున్నారు.  అందుకని మట్టిని విశ్లేషించడం దగ్గరనుంచి బలమైన స్టోన్​ ఫౌండేషన్​ వరకు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నారు.

స్ట్రక్చరల్ స్టెబిలిటీ కోసం ప్రత్యేకించి సాఫ్ట్​వేర్​ టెక్నాలజీ ఏమీ లేదు. సీబీఆర్​ఐ  రూర్కి గ్యారెంటీ స్టెబిలిటీ గురించి స్టడీ చేసేందుకు ముందుకు వచ్చింది. విస్తారంగా స్టడీ చేశాక ప్రపంచవ్యాప్తంగా 2,500 ఏండ్లు చెక్కుచెదరని ఆలయ నిర్మాణం ఇదని తేల్చారు.