కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం..వాళ్ల ఇండ్లను ముంచెత్తింది

కొత్త రైల్వే లైను నిర్మాణం వారి ఇండ్లను ముంచెత్తింది. కొత్త రైల్వే లైను వస్తుందని సౌకర్యంగా ఉంటుందని ఆ ప్రాంతవాసులు మురిసిపోయారు. ఇంతలోనే ఇండ్లలో కి నీరు రావడంతో బెంబేలెత్తిపోయారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరి.. స్థానికులు తీవ్ర ఇబ్బందులుపడుతున్న పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. 

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాల్ టెక్స్ ఏరియాలో మూడో రైల్వే లైన్ కోసం నిర్మాణ పనులు చేపట్టారు అధికారులు. 3వ ట్రాక్ నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిలిచిన వరదనీరు కాల్ టెక్స్ ఏరియాలోని రైల్వే కార్టర్స్ , స్థానికంగా ఉన్న ఇళ్లలోకి చేరింది. దీంతో ప్రతి ఇంటిలో మోకాళ్లోతు నీళ్ళు  నిలిచాయి. ఇండ్లలో ఉన్న సామాగ్రి అంతా తడిసి ముద్దయింది.  

ALSO READ | సమగ్ర భూసర్వేనే పరిష్కారం

ఈ ఘటనతో స్థానికులు, రైల్వే క్వార్టర్స్ లో ఉన్నవారంతా షాక్ గురయ్యారు. ఇళ్లలోని సామగ్రి తడవడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.  తక్షణమే తమ సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను డిమాండ్  చేస్తున్నారు.