బాధ్యత ఎరిగిన కానిస్టేబుల్

సాధారణంగా ఏదైనా రోడ్డుపై పడిపోయి ఉంటే చూసి చూడనట్టు వెళ్లిపోతుంటాం. ఇతరులకు ప్రమాదం అని తెలిసినా పట్టించుకోం. కానీ ఓ కానిస్టేబుల్​అలా చేయలేదు. నిజామాబాద్–ఆర్మూర్ 63వ జాతీయ రాహదారిపై ముబారక్ నగర్ వద్ద రోడ్డుపై మక్కలు పడిపోయి ఉండడాన్ని గమనించిన వినయ్ గౌడ్ అనే కానిస్టేబుల్..

వాహనదారులకు వారికి ప్రమాదం జరగకుండా ఆ మక్కలను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించాడు. ఈ దృశ్యాన్ని వెలుగు ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు.‌‌‌‌ - వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్