ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ లిరీజ్

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) 51 కానిస్టేబుల్/ ట్రేడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్ గ్రూప్ ‘సి’ నాన్ గెజిటెడ్ (నాన్-మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.
ఖాళీలు: మొత్తం 51 ఖాళీల్లో కానిస్టేబుల్(టైలర్): 18, కానిస్టేబుల్(కోబ్లర్): 33 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. 

అర్హత: పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

సెలెక్షన్​: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్స్​: ఆన్​లైన్​లో ఆగస్టు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్​ ఫీజు రూ.100 (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహిళలకు ఫీజు మినహాయింపు) చెల్లించాలి. వివరాలకు www.itbpolice.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.