ఇటీవల గుండెపోటుతో మరణాలు బాగా పెరిగాయి. ఆడుతూ..వయసుతో సంబంధం లేకుండా పాడుతూ కుప్పకూలిపోతున్నారు. స్నానం చేస్తూ గుండెపోటుతో మృతి.. క్రికెట్ ఆడుతూ హార్ట్ అటాక్ తో మృతి.. పత్రికా సమావేశంలో మాట్లాడుతూ మృతి..ఇలా అనేక గుండెపోటుతో చనిపోయారని రోజుకో వార్త వింటున్నాం..చూస్తున్నాం.. తాజాగా ఢిల్లీలో ఓ యువ కానిస్టేబుల్ డ్యాన్స్ చేస్తూ కుప్పుకూలి ప్రాణాలు ఒదిలిన సంఘటన జరిగింది..
గతంలో ఓ 45 యేళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా గుండెపోటు వంటి అనారోగ్యం కనిపించేది..గత 5యేళ్లుగా గుండెపోటులో చిన్నారులు కూడా చనిపోయిన సంఘటనలు జరుగుతున్నాయి. కారణాలు ఏవైనా.. గుండెపోటుతో మరణాలు పెరగడం ఆందోళన కలిస్తోంది.
తాజాగా ఢిల్లీలో ఓ యువ పోలీస్ కానిస్టేబుల్ డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. ఢిల్లీ రూప్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవికుమార్.. స్టేషన్ హౌస్ అధికారి (ఎస్‌హెచ్‌వో) బదిలీ కావడంతో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యాడు.ఆ కార్యక్రమంలో రవికుమార్ పలు పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో రవికుమార్ ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు.
అతడి సహచరులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. రవికుమార్ చనిపోయినట్లు ప్రకటించారు. అప్పటివరకు తమతో సరదగా ఉన్న సహచరుడు కానిస్టేబుల్ రవికుమార్ మృతిచెందడంతో ఆయన మిత్రులు షాక్‌కు గురయ్యారు.
హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన రవికుమార్ 2010లో ఢిల్లీ పోలీస్ డిపార్టుమెంట్ చేరాడు. అతడి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 45 రోజుల క్రితమే రవికుమార్ యాంజియోగ్రఫీ పరీక్ష చేయించుకున్నారు.