రైళ్లల్లో ఫుడ్‌పై కంప్లైంట్స్ 500 శాతం పెరిగాయి : కాంగ్రెస్‌కు IRCTC కౌంటర్

దేశవ్యాప్తంగా రైళ్లలో నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం..  రైల్వే శాఖపై మండిపడింది. అందుకు ఎన్డీఏ ప్రభుత్వం అవలంభించిన విధివిధానాలే కారణమని ఆరోపించింది. గడిచిన రెండేళ్లలో రైళ్లలో నాసిరకం ఆహార పదార్థాలు 500 శాతం పెరిగినట్లు నివేదించిన RTI రిపోర్టును కాంగ్రెస్ అందుకు ఉదహరణగా పేర్కొంది. 

ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ రైల్వేలను నాశనం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. రైల్వేలో ప్రయాణం, ఆహారం రెండూ సురక్షితంగా ఉండని పరిస్థితి ఉందని పేర్కొంది. సౌకర్యాల పేరుతో ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు తప్ప.. సామాన్యులకు ఏమీ అందడం లేదని ఎన్డీఏ ప్రభుత్వ తీరును కాంగ్రెస్ ఎండగట్టింది.

"గడిచిన రెండేళ్లలో రైళ్లలో నాసిరకం ఆహారంపై ఫిర్యాదులు 500 శాతం పెరిగాయి. రైల్వే ఫుడ్ వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్నిసార్లు కీటకాలు, మరికొన్నిసార్లు బొద్దింకలు కనిపిస్తాయి. రైల్వే శాఖ పనితీరుకు ఇది నిదర్శనం. ఈ విషయం దేశం మొత్తానికి తెలుసు. ప్రజల పట్ల వారికి ఎలాంటి శ్రద్ధ లేదు.. ఎప్పుడూ వారి ఆలోచన ధనవంతులైన తమ స్నేహితుల గురించే.. " అని కాంగ్రెస్ ఎక్స్ లో పోస్ట్‌ చేసింది.

స్పందించిన రైలే శాఖ

రైళ్లలో నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై IRCTC సోషల్ మీడియా ద్వారా స్పందించింది. కరోనా మహమ్మారి సమయంలో రైళ్లు పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఘటనలు జరిగాయని ఐఆర్సీటీసీ వివరణ ఇచ్చుకుంది.