బీఆర్ఎస్, బీజేపీలది అరాచక పాలన : జీవన్ రెడ్డి

బోధన్​, వెలుగు: పదేండ్ల బీజేపీ, బీఆర్ఎస్ కేంద్ర రాష్ట్ర పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా అరాచకాలు సృష్టించారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి బోధన్ మండలం పెగడపల్లి, సాలూర మండల కేంద్రాల్లో ఆయన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతను కేసీఆర్ నిండా ముంచాడని ఆవేదన వ్యక్తం చేశారు. 

 బీజేపీ రెండు కోట్ల మంది నిరుద్యోగులకు  ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. నిజామాబాద్ ఎంపీగా తనను గెలిపిస్తేనే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని చెప్పారు.  కార్యక్రమంలో  రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్,  డీసీసీబీ  డెలిగేట్ గంగా శంకర్​, కాంగ్రెస్​ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామీణ  ప్రజలు పాల్గొన్నారు.