రైతు సంబరాల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. బీఆర్ఎస్ హయాంలో వేలాది మంది రైతులు ఆత్మహత్య

చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం టేకుమట్ల రైతు వేదికలో రైతు రుణమాఫీ సంబరాల్లోపెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  పాల్గొన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసిందన్నారు. గతంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో  పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో వేలాది మంది  రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎంపీ వంశీ అన్నారు.  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా రైతులకు ఎలాంటి సహాయం చేయలేదన్నారు.  కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రైతులకు అండగా నిలిచారన్నారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం అప్పలపాలు చేసిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా సోనియా గాంధీ .. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు.  మోడీ గ్యారెంటీ పేరుతో బీజేపీ  ప్రభుత్వం రైతులను గోస పెట్టిస్తుందన్నారు.  బీజేపీ ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకు మాత్రమే రుణాన్ని మాఫీ చేశారు తప్ప రైతులను ఏనాడు పట్టించుకోలేదని ఎంపీ వంశీకృష్ణ అన్నారు.