జగిత్యాల రూరల్ వెలుగు: గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ కృషి చేస్తుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలం కల్లేడ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు చేస్తామని, కుల,మత తేడా లేకుండా అన్ని వర్గాల అభివృద్ధి కి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని రానున్న రోజుల్లో మరిన్ని పనులకు శ్రీకారం చుడతామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పేద, మధ్యతరగతి వారికి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.అనంతరం జిల్లా కేంద్రంలోని 41 వార్డులో రూ 10 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి, పీఏసీఎస్ చైర్మన్ సందీప్ రావు, ఎంపీఓ రవి బాబు, ఏఈ రాజ మల్లయ్య, మహేశ్వర రావు, పరశురాం గౌడ్ పాల్గొన్నారు.