హర్యానా రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా అసెంబ్లీ ఫలితాలు వస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు అందరూ కాంగ్రెస్ మళ్లీ అధికారం చేపడుతుందని భావించారు. కానీ.. ప్రజల తీర్పు అందుకు భిన్నంగా ఉంది. ఫస్ట్ రౌండ్ టైంలో మొత్తం 89 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 60 స్థానాల్లో లీడ్ ఉన్నా.. నాల్గైదు రౌండ్స్ ఓట్ల లెక్కింపుకు అయిపోయే సరికి అంచనాలు తారుమారు అయ్యారు. కౌంటింగ్ రోజు( అక్టోబర్ 8) సాయంత్రం నాలుగు గంటలకు 49 స్థానాల్లో బీజేపీ, 35 నియోజవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలు ఆదిపత్యంలో ఉన్నాయి. హర్యానాలో అధికార పార్టీకి వ్యతిరేకతే బీజేపీని నెట్టుకొచ్చింది. కాంగ్రెస్ అనుకున్న ఫలితాలు రాకపోవడానికి ఈ ఐదు కారణాలే..
కాంగ్రెస్ అంతర్గత పోరు:
2019 ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకుంది. ప్రస్తుతం 89 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 సీట్లలో మాత్రమే కాంగ్రెస్ ఆథిప్యతంలో కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ప్రజల తీర్పు ఉంది. అనూహ్యంగా బీజేపీ హర్యానాలో 48 నియోజకవర్గాల్లోని అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ ఫలితాలకు కారణం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత పోరే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అగ్రనేతలు అధికారం కోసం తహతహలాడడం ప్రధాన అంశం. ఎన్నికలకు చాలా ముందు నుంచే కాంగ్రెస్ నేతలు గెలుపు కన్ఫామ్ అని ముఖ్యమంత్రి పదవి కోసం మంతనాలు ప్రారంభించారు. అనుభవజ్ఞుడు భూపిందర్ సింగ్ హుడా, సీనియర్ నాయకురాలు కుమారి సెల్జా మధ్య ఉన్న పోరు అందరికీ తెలిసిందే. అభ్యర్థులను లేదా పొత్తులను నిర్ణయించడంలో భూపిందర్ సింగ్ హుడాకు హైకమాండ్ స్వేచ్ఛ ఇచ్చింది.. అయినా ఇది పని చేయలేదు.
లోకల్ లీడర్స్, ఇండిపెండెంట్లు :
పోలైన ఓట్ల-షేర్‌లో కాంగ్రెస్ బిజెపి కంటే స్వల్పంగా ముందంజలో ఉన్నప్పటికీ.. సీట్ల విషయానికి వచ్చే సరికి అది పెద్ద తేడాగానే ఉంది. హర్యానాలో కాంగ్రెస్ అధికార వ్యతిరేక ఓట్లను ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లు లాక్కున్నారు. ఇది బీజేపీకి ప్లస్ అయ్యింది. అయితే ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు విజయం సాధించలేకపోయాయి. ప్రస్తుతం ఐఎన్‌ఎల్‌డీ, బీఎస్‌పీ ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉండగా, నలుగురు స్వతంత్రులు మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు.
ALSO READ | వీడిన ఉత్కంఠ.. ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన CM నాయబ్ సింగ్ సైనీ
జాట్ వ్యతిరేక ఏకీకరణ:
హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ జాట్ ఓట్లపై దృష్టి సారించగా.. BJPకి అనుకూలంగా జాట్-యేతర ఓట్ల మారాయి. లాస్ట్ టైం రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం జాట్ సామాజికవర్గం పునరాగమనాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఇతర సంఘాలు అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది.
ఎలక్షన్ టైంలో బీజేపీ బ్యాక్ గ్రౌండ్ వర్క్:
గ్రౌండ్ లెవల్ లో బీజేపీ చాలా కష్టపడింది. ఎగ్జిట్ పోల్స్ విశ్లేషకులు బీజేపీని తప్పుపట్టినప్పటికీ, ధర్మేంద్ర ప్రధాన్ బాగా పని చేయడం వల్ల బ్యాక్ గ్రౌండ్ పార్టీకి అనుకూలంగా మారింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఈ ఎన్నికల కోసం బీజేపీ ప్రచార బాధ్యతలు అప్పగించారు. హైకమాండ్ చెప్పినట్లు అతను పని చేశాడు. బీజేపీ ఎన్నికల యంత్రాంగం మళ్లీ కాంగ్రెస్ నుంచి విజయాన్ని లాగేసుకుంది.
పట్టణాల్లో BJP ఆధిపత్యం:
గత దశాబ్దంలో BJP హర్యానాలోని గుర్గావ్, ఫరీదాబాద్ వంటి పట్టణ ప్రాంతాలలో మద్దతును పెంచుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని భావించినా.. అది అనుకున్నంతగా జరిగేలా కనిపించడం లేదు. గుర్గావ్, ఫరీదాబాద్, బల్లభ్‌గఢ్‌లలో ఈ సమయంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది.