- ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి
- ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మన్మోహన్
వెలుగు, నెట్ వర్క్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కాంగ్రెస్ శ్రేణులు మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఘన నివాళులు అర్పించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ క్యాంపు ఆఫీసులో మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మేయర్ అనిల్‌కుమార్, కార్పొరేటర్లు, లీడర్లు పాల్గొన్నారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మానకొండూరు ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి పురుమళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా10 ఏళ్లపాటు దేశానికి ఎనలేని సేవ చేశారని, ఆయన హాయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. మన్మోహన్ సింగ్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షుడు తిరుమల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
శుక్రవారం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో ఎమ్మెల్యే విజయరమణ రావు మాజీ ప్రధాని ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చొప్పదండిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళి అర్పించారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాకుండా యావత్ దేశం గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. చొప్పదండి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నిజానపురం చందు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కథలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మన్మోహన్ సింగ్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు