ఉర్దూ అకాడమీ చైర్మన్ కు సన్మానం

ఆర్మూర్, సిరికొండ, నవీపేట్,​ వెలుగు:  తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నియమితులైన తాహెర్ బిన్ హందాన్ ను కాంగ్రెస్ లీడర్లు సన్మానించారు. హైదరాబాద్ లో ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించగా ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గ ఇన్​చార్జులు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ముత్యాల సునీల్ కుమార్, సిరికొండ మండలాధ్యక్షుడు బాకారం రవి, నవీపేట్​మండల కాంగ్రెస్​ నాయకులు అభినందించారు.