కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీసీసీ పీఠంపై  కాంగ్రెస్ లీడర్ల ఆశలు

  • ఎమ్మెల్యేలకే బాధ్యతలు అప్పగిస్తామని పీసీసీ చీఫ్​ చేసిన ప్రకటనతో డైలామా
  • ఉమ్మడి జిల్లాలోని డీసీసీ అధ్యక్షులంతా ఎమ్మెల్యేలే 
  • తాజా డీసీసీల కొనసాగింపుపై సస్పెన్స్ 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో డీసీసీ పదవులపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ మధ్యనే పీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే జిల్లాల పర్యటన ప్రారంభించడంతో.. ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. అయితే డీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఎమ్మెల్యేలకు అప్పగిస్తామని పీసీసీ చీఫ్ ఇటీవల హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రకటించిన విషయం తెలిసిందే.  కాంగ్రెస్ అధికారంలోకి  రాకముందు నుంచి డీసీసీ అధ్యక్షులుగా ఉన్న లీడర్లంతా ఎమ్మెల్యేలుగా గెలిచారు.

దీంతో డీసీసీల మార్పుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుత కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ  నాలుగేళ్లుగా,  రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాలకు ధర్మపురి ఎమ్మెల్యే  అడ్లూరి లక్ష్మణ్,  పెద్దపల్లికి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రెండేళ్లుగా కొనసాగుతున్నారు. కాగా పీసీసీ చీఫ్ ప్రకటన నేపథ్యంలో వీరినే మళ్లీ డీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా కొనసాగిస్తారా లేదా ఆయా జిల్లాల్లోని ఇతర నేతలకు అవకాశం కల్పిస్తారా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. 

రేసులో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు.. 

కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చాలా కాలంగా పార్టీ కోసం పనిచేసిన లీడర్లు నామినేటెడ్ పోస్టులు లేదంటే పార్టీలో కీలక పదవులు వస్తాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు. దీంతో నామినేటెడ్ పోస్టులు దక్కకుంటే పార్టీ పదవుల్లోనైనా సముచిత ప్రాధాన్యం కల్పించాలని కోరుకుంటున్నారు. అయితే పార్టీ జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్నవారు గ్రూపులకతీతంగా పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవడం, పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంతోపాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

అందుకే డీసీసీ అధ్యక్ష బాధ్యతలను అన్నిరకాల సమర్థులైన వారికి ఇవ్వాలని పీసీసీ చీఫ్ భావిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ కరీంనగర్ డీసీసీ చీఫ్ పదవి ఎమ్మెల్యేలకు కాకుండా లీడర్లకు ఇవ్వాల్సి వస్తే.. తమ పేరు పరిశీలించాలని ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్ రావు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరినట్లు తెలిసింది. వీరితోపాటు సిటీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఆకారపు భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి డీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. బీసీకి డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే తన పేరు పరిశీలించాలని  టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ రాష్ట్ర నాయకత్వాన్ని కోరినట్లు సమాచారం.

వీరందరిలో వెలిచాల రాజేందర్ రావు వైపే పార్టీ ముఖ్య నేతలు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీసీ రేసులో  తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు ప్రవీణ్ ఆలియాస్ టోని, మరో నాయకుడు గడ్డం నర్సయ్య, ముస్తాబాద్ కు చెందిన చక్రధర్ రెడ్డి, వైద్య శివప్రసాద్  తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో మాత్రం డీసీసీ పదవి మార్పుపై ఎలాంటి ప్రచారం జరగడం లేదు. దీంతోపాటు సీనియర్లు సైతం పెద్దగా ఆసక్తి కనబరచడం లేన్నట్లు తెలుస్తోంది. 

మంత్రులు, ఎమ్మెల్యేలు సూచించిన వారికే.. 

ప్రస్తుతం కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సుడా చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అవకాశం దక్కింది. అలాగే ఇదే జిల్లాకు చెందిన నేరెళ్ల శారద(బీసీ సామాజికవర్గం) మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమితులయ్యారు. తాజాగా జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సన్నిహితుడిగా పేరున్న సత్తు మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియామకమయ్యారు.

 మరికొన్ని రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల కోసం జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల సూచనలు కీలకంగా మారనున్నాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్,  శ్రీధర్ బాబుతోపాటు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిసింది..