గోదావరిఖని, వెలుగు: రామగుండం రైల్వేస్టేషన్‌లో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను హాల్టింగ్ ఇచ్చేలా రైల్వే ఆఫీసర్లతో చర్చించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను కాంగ్రెస్ లీడర్ అనుమాస (జీన్స్) శ్రీనివాస్ కోరారు. మంగళవారం ఢిల్లీలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వంశీకృష్ణతోపాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిసి శాలువాలతో సత్కరించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. రామగుండంలో రైళ్ల హాల్టింగ్‌తో ఇక్కడి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
వాకర్స్‌కు స్వీట్ల పంపిణీ
పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గోదావరిఖని పీజీ కాలేజీ గ్రౌండ్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్ గడ్డం మధు ఆధ్వర్యంలో వాకర్స్‌కు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగరేణి డిపెండెంట్స్ ఫోరం లీడర్ కోరం నరేందర్ రెడ్డి, భీమ్ సందేశ్, సారయ్య, సూర్యనారాయణరెడ్డి, రాజన్న, సదానందం, రామ్మోహన్, శ్రీధర్, వేణు, నర్సింగ్, రఫిక్, యోగ గురువులు అన్నపూర్ణ, బుర్ర శంకర్ గౌడ్ పాల్గొన్నారు.