నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్లు.. నియామ‌‌‌‌‌‌‌‌కాలు..ప్రమోషన్లు!.

పార‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌ర్శకమైన  బ‌‌‌‌‌‌‌‌దిలీల‌‌‌‌‌‌‌‌తో  ఇటు ఉద్యోగులు.. అటు నిరుద్యోగుల మ‌‌‌‌‌‌‌‌న్ననలు పొందుతున్న  ప్రజాప్రభుత్వంపై  తోడేళ్ల మూక‌‌‌‌‌‌‌‌లు  కుట్రలు కొనసాగిస్తున్నాయి. లేని సమస్యలు సృష్టిస్తూ  నిరుద్యోగుల‌‌‌‌‌‌‌‌ను కొలువులకు  దూరంచేస్తూ  పక్కదారి ప‌‌‌‌‌‌‌‌ట్టిస్తున్నాయి.  త‌‌‌‌‌‌‌‌మ రాజ‌‌‌‌‌‌‌‌కీయ ప‌‌‌‌‌‌‌‌బ్బం గ‌‌‌‌‌‌‌‌డుపుకునేందుకు కుతంత్రాలకు 
తెర లేపుతున్నాయి.  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో  కొలువుదీరి  కేవ‌‌‌‌‌‌‌‌లం 200 రోజులు మాత్రమే గడిచాయి. ఈ కొద్ది స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌యంలోనే  గ్రూప్ –1 ప‌‌‌‌‌‌‌‌రీక్షకు నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్ జారీ చేసింది. 

ఇప్పటికే  ప్రిలిమ్స్ ప‌‌‌‌‌‌‌‌రీక్షను స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ర్థంగా నిర్వహించింది. 11,062  ఉపాధ్యాయ పోస్టుల  భ‌‌‌‌‌‌‌‌ర్తీకి  డీఎస్సీ  నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్ విడుద‌‌‌‌‌‌‌‌ల చేసింది.  సుమారు ఏడువేల మంది స్టాఫ్ న‌‌‌‌‌‌‌‌ర్సుల‌‌‌‌‌‌‌‌కు  నియామ‌‌‌‌‌‌‌‌క ప‌‌‌‌‌‌‌‌త్రాల‌‌‌‌‌‌‌‌ను సీఎం రేవంత్ రెడ్డి అంద‌‌‌‌‌‌‌‌జేశారు. గురుకుల ఉపాధ్యాయుల పోస్టుల నియామ‌‌‌‌‌‌‌‌కాలను కాంగ్రెస్​ ప్రభుత్వం చేప‌‌‌‌‌‌‌‌డుతోంది.  వివిధ శాఖ‌‌‌‌‌‌‌‌ల్లో ఉన్న ఖాళీల భ‌‌‌‌‌‌‌‌ర్తీకి అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఇర‌‌‌‌‌‌‌‌వై  ఏండ్లుగా  పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్లను  కాంగ్రెస్​ ప్రభుత్వం పారదర్శకంగా చేప‌‌‌‌‌‌‌‌ట్టింది.  

హైకోర్టు,  సుప్రీంకోర్టుల్లో  కేసులు ఉండ‌‌‌‌‌‌‌‌డం, మరోవైపు  గ‌‌‌‌‌‌‌‌త  ప్రభుత్వం  ఆ కేసుల ప‌‌‌‌‌‌‌‌రిష్కారంపై చొర‌‌‌‌‌‌‌‌వ చూప‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌పోవ‌‌‌‌‌‌‌‌డంతో  రెండు ద‌‌‌‌‌‌‌‌శాబ్దాలుగా  తెలంగాణ‌‌‌‌‌‌‌‌లో ఉపాధ్యాయులు ప్రమోషన్లకు నోచుకోలేదు.  రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీక‌‌‌‌‌‌‌‌రించిన త‌‌‌‌‌‌‌‌ర్వాత ఈ విష‌‌‌‌‌‌‌‌యంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.  ఫ‌‌‌‌‌‌‌‌లిత‌‌‌‌‌‌‌‌మే 200 రోజుల్లోనే  హైకోర్టు,  సుప్రీంకోర్టులో ఉన్న చట్టపరమైన ఆటంకాలను  అధిగ‌‌‌‌‌‌‌‌మించి రేవంత్​ సర్కారు  ప్రమోషన్లకు మోక్షం క‌‌‌‌‌‌‌‌లిగించింది.  దీంతో 1,870 మంది స్కూల్ అసిస్టెంట్స్​నుంచి  ప్రధానోపాధ్యాయులుగా, 17,072 మంది సెకండ‌‌‌‌‌‌‌‌రీ గ్రేడ్ ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. పూర్తిగా పారదర్శకంగా, వివాద‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌హితంగా ఈ ప్రక్రియ పూర్తయింది.  

ఆట మొదలయ్యాక...నిబంధనలు మార్పు చట్టవిరుద్ధం

కాంగ్రెస్​ ప్రభుత్వం విడుదలచేస్తున్న వ‌‌‌‌‌‌‌‌రుస నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్లతో ఒకవైపు నిరుద్యోగ యువత ఆత్మవిశ్వాసంతో పోటీ ప‌‌‌‌‌‌‌‌రీక్షలకు  ప్రిపేర‌‌‌‌‌‌‌‌వుతుండ‌‌‌‌‌‌‌‌గా,  మరోవైపు ప్రమోషన్లతో  రెట్టించిన ఉత్సాహంతో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. దీంతో ఈ  ప్రక్రియలకు ఆటంకం క‌‌‌‌‌‌‌‌లిగించ‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌మే ల‌‌‌‌‌‌‌‌క్ష్యంగా కొన్ని  ప్రజాప్రభుత్వ వ్యతిరేక పార్టీలు,  కొంద‌‌‌‌‌‌‌‌రు రాజ‌‌‌‌‌‌‌‌కీయ నాయ‌‌‌‌‌‌‌‌కులు,  ఉద్యోగార్థుల  వ్యతిరేకులు వివిధ ముసుగులు త‌‌‌‌‌‌‌‌గిలించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం చిమ్మడం ప్రారంభించారు.  ఏదైనా ఆట  ప్రారంభించే ముందే  నిబంధ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌లు పెట్టుకుంటారు.  ఒకసారి ఆట మొద‌‌‌‌‌‌‌‌లైన త‌‌‌‌‌‌‌‌ర్వాత నియమ, నిబంధనలు మార్చడం అనైతికం. చ‌‌‌‌‌‌‌‌ట్ట విరుద్ధం.  కానీ,  రాష్ట్రంలోని కొంద‌‌‌‌‌‌‌‌రు ప్రతిపక్ష నేత‌‌‌‌‌‌‌‌లు మాత్రం తాము చెప్పిన‌‌‌‌‌‌‌‌ట్లే  నిబంధ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌లు ఇష్టారీతిగా మార్చమని  డిమాండ్ చేస్తున్నారు. 

ఈక్రమంలో  నిరుద్యోగుల‌‌‌‌‌‌‌‌ను మభ్యపెట్టి రెచ్చగొడుతూ ప్రభుత్వ వ్యతిరేకత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.  ప్రస్తుతం గురుకుల ఉపాధ్యాయుల నియామకాల విష‌‌‌‌‌‌‌‌యంలో సృష్టిస్తున్న అపోహ‌‌‌‌‌‌‌‌లే  ఇందుకు నిద‌‌‌‌‌‌‌‌ర్శనం.  తెలంగాణ గురుకుల  విద్యాసంస్థల్లో  నియామ‌‌‌‌‌‌‌‌కాల కోసం  తెలంగాణ  గురుకుల  విద్యాసంస్థల నియామ‌‌‌‌‌‌‌‌కాల బోర్డు (TREI-RB) గ‌‌‌‌‌‌‌‌తేడాది   ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో   నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్లు జారీ చేసింది. ఆ నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్లను  1997,  ఫిబ్రవరి 22న  జారీ చేసిన జీవో  ఎం.ఎస్‌‌‌‌‌‌‌‌.నెం: 85 ప్రకారం విడుద‌‌‌‌‌‌‌‌ల చేశారు.  ఆ జీవో ప్రకారం ముందుగా గుర్తించిన ఖాళీల‌‌‌‌‌‌‌‌కు  నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్  విడుద‌‌‌‌‌‌‌‌ల  చేస్తారు. నియామ‌‌‌‌‌‌‌‌కాల స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌యంలో ఎటువంటి  వెయిటింగ్ లిస్ట్ ఉండ‌‌‌‌‌‌‌‌దు. నియ‌‌‌‌‌‌‌‌మితులైనవారు చేర‌‌‌‌‌‌‌‌కుండా మిగిలిపోయిన  పోస్టులను త‌‌‌‌‌‌‌‌ర్వాత నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌కు ఫార్వార్డ్  చేస్తారు. 

విజ్ఞతతో వ్యవహరిస్తేనే మేలు

గ‌‌‌‌‌‌‌‌త ప‌‌‌‌‌‌‌‌దేండ్లలో ఉద్యోగ నియామ‌‌‌‌‌‌‌‌కాల విష‌‌‌‌‌‌‌‌యంలో  చోటు చేసుకున్న జాప్యం, నిర్లక్ష్యాన్ని  నిరుద్యోగులు ప్రత్యక్షంగా చ‌‌‌‌‌‌‌‌విచూశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన త‌‌‌‌‌‌‌‌ర్వాత నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్లు జారీ అవుతున్నతీరు, టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిన తీరు, నియామ‌‌‌‌‌‌‌‌కాలు,  బ‌‌‌‌‌‌‌‌దిలీలు,  ప్రమోషన్ల  విష‌‌‌‌‌‌‌‌యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిని నిరుద్యోగులు అర్థం చేసుకోవాలి. ఈ విష‌‌‌‌‌‌‌‌యంలో త‌‌‌‌‌‌‌‌మ స్వార్ధ  ప్రయోజనాల కోసం  రెచ్చగొట్టే  ప్రతిపక్ష నాయ‌‌‌‌‌‌‌‌కుల విష‌‌‌‌‌‌‌‌యంలో  నిరంత‌‌‌‌‌‌‌‌రం అప్రమత్తంగా ఉండాలి.  నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్లకు  విరుద్ధంగా వెళితే  న్యాయ‌‌‌‌‌‌‌‌స్థానాల్లో  ఏళ్లకు ఏళ్లు పోరాటం చేయాల్సివస్తుంది. ఎంతో విలువైన స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌యాన్ని నిరుద్యోగులు కోల్పోవాల్సి వ‌‌‌‌‌‌‌‌స్తుంది.  రాష్ట్ర ప్రభుత్వం  వ‌‌‌‌‌‌‌‌రుస నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్లు విడుద‌‌‌‌‌‌‌‌ల చేసి స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ర్థంగా ప‌‌‌‌‌‌‌‌రీక్షలు నిర్వహిస్తూ ,  వివిధ శాఖ‌‌‌‌‌‌‌‌ల్లో ఖాళీల భ‌‌‌‌‌‌‌‌ర్తీకి  మరిన్ని నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్లు విడుద‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌కు రంగం సిద్ధం చేస్తున్నవేళ నిరుద్యోగులు ఎంతో విజ్ఞతతో వ్యవహరించాలి. రాబోయే  నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్ల కోసం స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ర్థంగా  ప్రిపేర్ కావాలి.  గుంట న‌‌‌‌‌‌‌‌క్కబుద్ధుల‌‌‌‌‌‌‌‌తో  రెచ్చగొట్టేవారికి  తగిన గుణపాఠం చెప్పాలి. 

ఉద్యోగార్థులను తప్పుదోవ పట్టిస్తున్న  ప్రతిపక్ష నేతలు

తెలంగాణ‌‌‌‌‌‌‌‌లో ప్రజాప్రభుత్వం ఏర్పడిన త‌‌‌‌‌‌‌‌ర్వాత నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌లో  నిబంధ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగానే నియామ‌‌‌‌‌‌‌‌క ప‌‌‌‌‌‌‌‌త్రాలు అంద‌‌‌‌‌‌‌‌జేశారు. అయితే, అర్హతల ఆధారంగా రెండు, మూడు పోస్టుల్లో  నియామ‌‌‌‌‌‌‌‌క ప‌‌‌‌‌‌‌‌త్రాలు అందుకున్నవారు  ఏదో  ఒక పోస్టులోనే జాయిన్ అవుతారు.  జీవో నెం: 85 ప్రకారం  నియ‌‌‌‌‌‌‌‌మితులైనవారు ఉద్యోగంలో  చేర‌‌‌‌‌‌‌‌కుండా  ఆ పోస్టు మిగిలిపోతే దానిని త‌‌‌‌‌‌‌‌ర్వాత నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌కు  ఫార్వార్డ్​చేయాలి.  వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండ‌‌‌‌‌‌‌‌దు. అయిన‌‌‌‌‌‌‌‌ప్పటికీ  మిగిలిపోయిన  పోస్టుల జాబితాలో త‌‌‌‌‌‌‌‌ర్వాత ఉన్నవారితో  నింపాల‌‌‌‌‌‌‌‌నే  డిమాండ్  తెర‌‌‌‌‌‌‌‌మీద‌‌‌‌‌‌‌‌కు తీసుకువ‌‌‌‌‌‌‌‌చ్చారు.

నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్  జీవో నెం: 85  ప్రకారం  విడుద‌‌‌‌‌‌‌‌లైన‌‌‌‌‌‌‌‌ప్పుడు  మిగిలిపోయిన  పోస్టులు  త‌‌‌‌‌‌‌‌ర్వాత  నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌కు  ఫార్వార్డ్ ​ చేయడంతప్ప  వెయిటింగ్ లిస్ట్ ఉండ‌‌‌‌‌‌‌‌దు. కానీ, ఆ రెండింటిని చేయాల‌‌‌‌‌‌‌‌ని గ‌‌‌‌‌‌‌‌తంలో  మంత్రులుగా ప‌‌‌‌‌‌‌‌నిచేసిన  నాయ‌‌‌‌‌‌‌‌కులు  ఉద్యోగార్థులను  త‌‌‌‌‌‌‌‌ప్పుదారి ప‌‌‌‌‌‌‌‌ట్టిస్తున్నారు. ప్రభుత్వంపై  ద్వేషంతో  అభ్యర్థుల్లో  లేనిపోని  ఆశలు రేపుతూ  గంద‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌గోళం సృష్టిస్తున్నారు. నిజంగా ప్రతిపక్ష నేత‌‌‌‌‌‌‌‌లు,  విద్యార్థి నాయ‌‌‌‌‌‌‌‌కుల ముసుగు వేసుకున్న కొంద‌‌‌‌‌‌‌‌రు చెప్పిన‌‌‌‌‌‌‌‌ట్లే  ప్రభుత్వ నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ త‌‌‌‌‌‌‌‌యారు చేసి, మిగిలిపోయిన ఖాళీల భ‌‌‌‌‌‌‌‌ర్తీకి  పూనుకుంటే, అదే నాయ‌‌‌‌‌‌‌‌కులు మ‌‌‌‌‌‌‌‌ళ్లీ  నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌కు  విరుద్ధంగా నియామకాలు చేస్తున్నారంటూ న్యాయ‌‌‌‌‌‌‌‌స్థానాల‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయిస్తారు. 

నియామకాలు నిలిచిపోయే ప్రమాదం

ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా వెళితే కోర్టులు ఆ ప్రక్రియను నిలిపివేస్తాయి. ఈ క్రమంలో  అస‌‌‌‌‌‌‌‌లు  నియామ‌‌‌‌‌‌‌‌కాల ప్రక్రియే నిలిచిపోయే  ప్రమాదం పొంచి ఉంది. ఆ కేసులు  తేలేవ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కు త‌‌‌‌‌‌‌‌ర్వాత నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్లు  జారీచేసే అవ‌‌‌‌‌‌‌‌కాశం కూడా ఉండ‌‌‌‌‌‌‌‌దు. క‌‌‌‌‌‌‌‌చ్చితంగా ఈ ప‌‌‌‌‌‌‌‌రిస్థితినే  ప్రతిపక్ష నేత‌‌‌‌‌‌‌‌లు కోరుకుంటున్నారు. ఈ సంద‌‌‌‌‌‌‌‌ర్భంగా గ్రూప్ –1 ప్రిలిమ్స్ రెండోసారి ర‌‌‌‌‌‌‌‌ద్దు చేసిన‌‌‌‌‌‌‌‌ప్పుడు హైకోర్టు చేసిన కీల‌‌‌‌‌‌‌‌క వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చుకోవాలి. అవేమంటే.. నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌లో  పేర్కొన్నట్లు  బ‌‌‌‌‌‌‌‌యోమెట్రిక్  విధానాన్ని  ఎందుకు పాటించ‌‌‌‌‌‌‌‌లేదని  నాడు హైకోర్టు  ప్రశ్నించింది.

నిబంధ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌లు  మార్చుకునే హ‌‌‌‌‌‌‌‌క్కు త‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌కు ఉంద‌‌‌‌‌‌‌‌ని టీజీపీఎస్సీ పేర్కొన‌‌‌‌‌‌‌‌గా  దానిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు పెట్టుకున్న  నిబంధ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌లను  మీరే  తుంగ‌‌‌‌‌‌‌‌లో తొక్కుతారా అని  ప్రశ్నించి పరీక్షను  ర‌‌‌‌‌‌‌‌ద్దు చేసింది. నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా వెళితే  ఏం జ‌‌‌‌‌‌‌‌రుగుతుంద‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌డానికి  ప్రత్యక్ష సాక్ష్యం గ్రూప్ –1 ప్రిలిమ్స్ ర‌‌‌‌‌‌‌‌ద్దే.  త‌‌‌‌‌‌‌‌మ హ‌‌‌‌‌‌‌‌యాంలో   ప్రశ్నప‌‌‌‌‌‌‌‌త్రాల లీకుల‌‌‌‌‌‌‌‌కు కార‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌మైనవారు,  నిరుద్యోగుల  జీవితాల‌‌‌‌‌‌‌‌తో  చెల‌‌‌‌‌‌‌‌గాట‌‌‌‌‌‌‌‌మాడినవారు ఇప్పుడు త‌‌‌‌‌‌‌‌మ ద్రోహబుద్ధిని చాటుకుంటున్నారు. 

- సామ రామ్మోహన్​రెడ్డి,చైర్మన్​,  మీడియా కమ్యూనికేషన్స్, టీపీసీసీ​