ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్..

  • ఎట్టకేలకు పొల్యూషన్ కంట్రోల్​ బోర్డ్ క్లియరెన్స్  
  •  ఎన్ ఓ సి జారీ చేసినఇరిగేషన్ శాఖ.. సెప్టెంబర్ 
  • నెలాఖరులోగా పనులు ప్రారంభం...

నిర్మల్, వెలుగు:  నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్ పట్ల వద్ద నిర్మించనున్న  ఆయిల్ పామ్ పరిశ్రమ కు  ఆటంకాలు తొలగిపోయాయి. అప్పటి ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్​ దీనికి శంకుస్థాపన చేసినా పొల్యూషన్​ బోర్డు అనుమతి  రాలేదు.  తాజాగా కాంగ్రెస్​  ప్రభుత్వం చొరవతో  ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి పొల్యూషన్​ బోర్డ్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. దీంతో స్థానికంగా వేల ఎకరాల్లో ఆయిల్​ పామ్​ సాగు చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

సాంకేతిక కారణాల సాకుతో.. 

దాదాపు రూ.  400 కోట్ల తో    నిర్మించే ఈ పరిశ్రమకు  సాంకేతిక కారణాలు చూపి అప్పడు రాష్ట్ర పొల్యూ షన్ బోర్డ్  క్లియరెన్స్ జారీ చేయలేదు.  గత ప్రభుత్వంలో స్థానిక నేత ఇంద్రకరణ్​ రెడ్డే పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు నుంచి అనుమతి  లభించలేదు. 

పట్టించుకోని గత ప్రభుత్వం

పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి గతంలోనే  40 ఎకరాల స్థలాన్ని సేకరించారు. మలేషియా కు చెందిన ఫ్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్  కంపెనీ ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది.  ఈ ఫ్యాక్టరీ కోసం   పామాయిల్​ ఏటా 3000 ఎకరాల్లో  మొత్తం పదివేల ఎకరాలలో  సాగు చేయాలని అధికారులు  లక్ష్యంగా పె ట్టుకున్నారు. ప్రస్తుతం దాదాపు 7000 ఎకరాలలో రైతులు ఈ పంటను సాగు చేస్తున్నా రు.  మార్చి వరకు మొత్తం పదివేల ఎకరాల లక్ష్యం దాటనున్నట్లు అధికారులు పే ర్కొంటున్నారు. . 

భారీగా సాగుతున్న పంట..

ఆయిల్ పామ్  పరిశ్రమను ఏర్పాటు చేయనున్న కారణంగా ఇక్కడి రైతులకు ఆ పంట సాగు కోసం పెద్ద ఎత్తు ఎత్తున అవగాహన కల్పించారు.     అంతర్ పంటలు   కూడా సాగు చేసే అవకాశం ఉండడంతో రైతులు  దీనిపై మొగ్గు చూపారు. క్రమక్రమంగా అన్ని మండలాలలో ఆయిల్ ఫాం పంట సాగు పెరిగింది.  

ALSO READ : ఆగష్టు 25న మారథాన్..సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

తొలగిన అడ్డంకులు..

పరిశ్రమ యాజమాన్యం రాష్ట్ర పొల్యూషన్ బోర్డు ద్వారా అనుమతుల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పట్లో ఫలితం దక్కలేదు.  గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఈ పరి శ్రమ ఏర్పాటు చేస్తున్న కారణంగా ఇరిగేషన్ శాఖ కూడా ఎన్ఓసీ జారీ చేయలేదు.   ఈ ఫ్యాక్టరీ బఫర్​ జోన్​లో  లేకపోవడంతో  ఇరిగేషన్ శాఖ  ఇటీవలే నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) జారీ చేసింది. దీంతో పరిశ్రమ నిర్మాణానికి   అడ్డంకులు తొలగాయి.   అన్ని  అ నుమతులు లభించడంతో  ఫ్యాక్టరీ నిర్మాణ పనులను రాబో యే సెప్టెంబర్  నెలలో చేపట్టనున్నారు.