ప్రభుత్వ స్కూళ్లలో సమస్యల పరిష్కారానికి కృషి : జువ్వాడి నర్సింగరావు

మెట్ పల్లి, వెలుగు : కోరుట్ల నియోజకవర్గంలోని సర్కారీ స్కూళ్లలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. శనివారం మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, హైస్కూళ్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా శిథిలావస్థలో ఉన్న హైస్కూల్ బిల్డింగ్ రిపేర్లు చేయించేందుకు నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు.

2018లో ప్రారంభమైన జూనియర్ కాలేజీ కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులు ఆరేళ్లు దాటినా ఇప్పటికీ పూర్తిచేయకపోవడం దారుణమన్నారు. ఈ సందర్భంగా హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8 మంది టీచర్లు ఉండాల్సి ఉండగా కేవలం నలుగురు మాత్రమే ఉన్నారని కొత్తవారిని నియమించేలా చర్యలు తీసుకోవాలని నర్సింగరావుకు  ఉపాధ్యాయ బృందం వినతిపత్రం అందజేశారు.