గోదావరిఖని/పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం సింగరేణి ఆర్జీ 1 ఏరియా వర్క్‌షాప్‌లో కార్మికులు సంబరాలు చేశారు. ఏరియా వర్క్‌షాప్ గేట్ ముందు బాణా సంచా కాల్చి నినాదాలు చేశారు. ఓదెల మండలంలో లీడర్లు పటాకులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కొందరు లీడర్లు ఓదెల మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
వంశీకృష్ణ గెలుపు కోసం ఎన్నికల ముందు ఆలయంలో ముడుపు కట్టామని, ఆయన విజయంతో మొక్కులు చెల్లించుకున్నట్లు లీడర్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంతెన వెంకటేశ్, బండ శంకర్, రాజం, పోషం, రాజిరెడ్డి, తిరుపతి, శ్రీనివాస్, బోడకుంట చిన్నస్వామి, సతీశ్, శ్రీనివాస్, వీరన్న, ఐలయ్యయాదవ్, కరుణాకర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, వినయ్తదితరులు పాల్గొన్నారు.