- మీట్ ది ప్రెస్ లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, వెలుగు: చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. 2025 డిసెంబర్ లో బోధన్, మెట్ పల్లి చక్కెర ఫ్యాక్టరీ లలో క్రషింగ్ ప్రారంభిస్తామన్నారు. ఐదేళ్లు అధికార పార్టీ ఎంపీగా ఉండి అభివృద్ధిని పట్టించుకోని అర్వింద్ ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బూటకపు హామీలిస్తున్నారని విమర్శించారు.
అర్వింద్ కవితను ఆదర్శంగా తీసుకుని పనిచేశారని, ఆయన ఎవరికీ అందుబాటులో లేరన్నారు. నిజామాబాద్ స్మార్ట్ సిటీ జాబితాలో లేకపోవడానికి అర్వింద్ నిర్లక్ష్యమే కారణమన్నారు. తాను గెలిస్తే స్మార్ట్ సిటీ జాబితాలో చేర్పించి అభివృద్ధి చేయిస్తానని మహిళా డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయిస్తానని, బోధన్ టు బీదర్ రైల్వే లైన్ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.