కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంజయ్.. పెద్దపల్లిలో వంశీకృష్ణ

  • ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీజేపీకి చెరో సీటు 
  • రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు మూడో స్థానమే 
  • 2,25,209 ఓట్ల మెజార్టీతో బండి.. 
  • 1.26 లక్షల ఓట్ల మెజార్టీతో గడ్డం వంశీకృష్ణ గెలుపు 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని పెద్దపల్లి, కరీంనగర్ స్థానాల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీజేపీ చెరో ఎంపీ సీటు గెలిచాయి. పెద్దపల్లిలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపొందగా, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్​ విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై 2,25,209 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.  5,85,116 ఓట్లతో సంజయ్ మొదటి స్థానంలో నిలవగా, 3,59,118 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు రెండో స్థానంలో, 2,82,163 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు. 

అలాగే పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలిచారు.  తాత గడ్డం వెంకటస్వామి, తండ్రి వివేక్ వెంకటస్వామి గతంలో ప్రాతినిధ్యం వహించిన పెద్దపల్లి స్థానం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. సక్సెస్ ఫుల్ బిజినెస్ మన్ గా పేరొందిన యువ నేతకు పెద్దపల్లి నియోజకవర్గ ఓటర్లు పట్టంకట్టారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోటీ నెలకొనగా.. బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం మూడో స్థానానికే పరిమితమయ్యారు. 

హుస్నాబాద్ మినహా అన్నిచోట్లా కమలమే.. 

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మినహా అన్ని చోట్లా బండి సంజయ్ ఆధిక్యం ప్రదర్శించారు. మంత్రి పొన్నం ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ లో కాంగ్రెస్ కు  79,001 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 55,873, బీఆర్ఎస్ కు 41,298 ఓట్లు పోలయ్యాయి. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనూ బండి సంజయ్ 6,748 ఓట్ల మెజార్టీ సాధించారు. మోదీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన వేములవాడలో సంజయ్ కి 81,714 ఓట్లు పోలవ్వగా.. ఇక్కడ  బీఆర్ఎస్ కు 38,142 ఓట్లు, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 36,022 ఓట్లు వచ్చాయి.  

ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన కరీంనగర్ నియోజకవర్గంలో బండి సంజయ్ కి ఏకపక్షంగా ఓట్లు పోలయ్యాయి.  కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో మొత్తం 24 రౌండ్లలో ఓట్లు లెక్కించగా.. 14వ రౌండ్ మినహా అన్ని రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించారు. 14వ రౌండ్ లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు 70 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అలాగే పోస్టల్ బ్యాలెట్లలో కూడా సంజయ్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. సంజయ్ కి 6,289 ఓట్లు రాగా, వెలిచాల రాజేందర్ రావుకు 2,461 ఓట్లు, వినోద్​కుమార్​కు 1,296 ఓట్లు వచ్చాయి.     

పెద్దపల్లి పార్లమెంట్​ వంశీకృష్ణదే

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్​ పరిధిలోని మంథని, పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను జేఎన్టీయూ కాలేజీలోని కౌంటింగ్​ సెంటర్​లో లెక్కించారు. మొత్తం 21 రౌండ్లలో లెక్కింపు జరగగా ప్రతి రౌండ్​లోనూ కాంగ్రెస్​ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఆధిక్యమే కొనసాగింది.

 మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్​ అభ్యర్థి 87,079 ఓట్లు సాధించగా, బీఆర్ఎస్​ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ​34,122 ఓట్లతో రెండో స్థానంలో సాధించారు. బీజేపీ అభ్యర్థి గోమాసశ్రీనివాస్​ 32,634 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. వంశీకృష్ణ సాధించిన 1,31,364 ఓట్ల మెజార్టీలో మంథని నుంచే 52,957 ఓట్లు ఉండడం విశేషం. ధర్మపురిలో మాత్రం బీజేపీకి కాంగ్రెస్​ అభ్యర్థి కన్నా 8,080 ఓట్లు  వచ్చాయి.