కల్తీ పెట్రోల్ పై ఆందోళన

నవీపేట్, వెలుగు: నవీపేట్​లోని భారత్ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ వచ్చిందని వినియోగదరులు ఆందోళనకు దిగారు. ఆదివారం రాత్రి రాంపూర్ గ్రామానికి చెందిన పవన్, పోశెట్టి పొలంలో మందు కొట్టే మెషిన్ కోసమని బాటిల్​లో లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నారు. బాటిల్ లో ఉన్న పెట్రోల్​కల్తీదని గుర్తించిన వినియోగదారులు బంక్ సిబ్బందిని ఇదేంటని ప్రశ్నించారు. గతంలోనూ కల్తీ పెట్రోల్ విక్రయించారని, సంబంధిత అధికారులు బంక్​యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు.