​ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా సర్వే సమగ్ర కుటుంబ షురూ

  •  వ్యాప్తంగా ప్రారంభమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే
  • పరిశీలించిన కలెక్టర్లు, అధికారులు
  • ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపు

జనగామ అర్బన్/ మహబూబాబాద్/ తొర్రూరు/ మంగపేట/    పర్వతగిరి/ ఎల్కతుర్తి/ వెలుగు: ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా బుధవారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలను అడిగి తెలుసుకుని, సమాచారాన్ని ప్రొఫార్మాలో నమోదు ​చేస్తున్నారు. అనంతరం స్టిక్కర్లను ఇంటికి అతికిస్తున్నారు. అధికారుల సర్వే తీరును జిల్లా కలెక్టర్లు, అధికారులు పరిశీలించారు. సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.జనగామ మున్సిపాలిటీ పరిధిలోని వీవర్స్​కాలనీ, గిర్నిగడ్డ, కుర్మవాడలో సర్వే తీరును కలెక్టర్ రిజ్వాన్​బాషాషేక్​స్పెషల్​డిప్యూటీ కలెక్టర్​సుహాసిని, మున్సిపల్​కమిషనర్​వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు.

 మహబూబాబాద్ పట్టణంలోని సోమ్లాతండా, 26 వార్డు ఆదర్శనగర్, జమండ్లపల్లి అంబేద్కర్ నగర్, మహబూబాబాద్ మండలం పర్వతగిరి, కంబాలపల్లి గ్రామాల్లో సర్వేను కలెక్టర్​అద్వైత్​కుమార్​సింగ్​మున్సిపల్​కమిషనర్​రవీందర్, ​ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. తొర్రూరు మండలంలోని ఆయా గ్రామాల్లో ఎంపీడీవో నర్సింహారావు, ఎంపీవో పూర్ణచందర్, మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో సర్వే తీరును కమిషనర్​శాంతికుమార్​పరిశీలించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్వేను కలెక్టర్ సత్య శారద పరిశీలించారు.

ఎల్కతుర్తి మండల కేంద్రంలో ప్రారంభమైన సర్వేను హనుమకొండ కలెక్టర్​ ప్రావీణ్య పరిశీలించారు. వరంగల్​సిటీలోని పలు డివిజన్లలో నిర్వహిస్తున్న సర్వేను బల్దియా మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, 27వ డివిజన్​లో కార్పొరేటర్ అనీల్ కుమార్​తో కలిసి కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు ఆయూత్ ప్రారంభించారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని చుంచుపల్లి, బోర్​నర్సాపురం గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేలో హౌస్​స్టిక్కరింగ్​ప్రక్రియను అడిషనల్​కలెక్టర్​సంపత్​రావు పరిశీలించి, సూచనలు చేశారు. 

పక్కాగా నమోదు చేయాలి..

అధికారులు ఇంటింటికీ వెళ్లి సభ్యుల వివరాలు పక్కాగా నమోదు చేసి, గోడపైన ఖచ్చితంగా స్టిక్కర్​ అంటించాలని పర్యవేక్షణలో అధికారులు ఎన్యూమరేటర్లకు సూచించారు. కుటుంబ యజమాని నుంచి సేకరించే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని వారికి అర్థమయ్యేలా వివరించాలన్నారు.