పుచ్చిపోయిన బఠానీలు... నాసిరకం ఇడ్లీ రవ్వ

  • కేజీబీవీలకు సప్లై చేస్తున్న కిరాణం సామాన్లు
  • నాసిరకంగా ఉన్నాయని తిప్పి పంపిస్తున్న ఎస్​ఓలు

నల్గొండ, వెలుగు : జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలకు నాసిరకమైన కిరాణం సామాగ్రి సప్లై చేస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. కొద్దిరోజుల  నుంచి కేజీబీవీలకు సప్లై చేసిన  సామాన్లు  క్వాలిటీ లేవని ఎస్​ఓలు వాపసు పంపిస్తున్నారు. అయితే ఆ సామగ్రి తాము సప్లై చేయలేదని, ఎప్పుడో పాతవి అంటూ సదరు కాంట్రాక్టర్లు బుకా యించడం అనుమానాలకు తావిస్తోంది.   అయినా విద్యాశాఖ ఎలాంటి విచారణ చేయకపోవడం పట్ల విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

 కేజీబీవీల్లో చదువుకునేది నిరుపేద బాలికలే. వీరికి  పౌష్టికాహారం అందించాల్సిన కాంట్రాక్టర్లు మొదటి దఫాలోనే పుచ్చిపోయిన బఠానీలు, నాసిరకం ఇడ్లీ రవ్వ, అటుకులు సప్లై చేశారు. మార్కెట్లో ప్రముఖంగా పేరొందిన కంపెనీల వస్తువులనే సప్లై చేస్తామని ఒప్పందం చేసుకున్న కాంట్రాక్ట్​ ఏజెన్సీ ఆచరణలో మాత్రం   పాటించడం లేదు.

 
ప్యాకెట్ల మీద స్టాంపులు మాయం 


కేజీబీవీలకు సప్లై చేసిన ప్యాకెట్ల మీద స్టాంపులు కనిపించడం లేదు. బఠానీల ప్యాకెట్​ ఓపెన్​ చేయగానే పుచ్చిపోయి కనిపిస్తున్నాయి. ఇక ఇడ్లీ ర వ్వు, అటుకుల ప్యాకెట్ల మీద బెస్ట్​ బిఫోర్​ మూడు నెలలు అని ఉంది కానీ ఏరోజున వాటిని తయారు చేశారు అనే వివరాలు కనిపించకుండా మా యం చేశారు. జూలై 20న కిరాణం సామాన్లు సప్లై చేయమని డీఈఓ వర్క్​  ఆర్డర్​ ఇవ్వగా, 40 రోజుల తర్వాత ఇప్పుడు సప్లై చేయడం అనుమానాలకు తావిస్తోంది.  దీని పైన   ఆఫీసర్లు సైతం సమాధానం చెప్పలేకపోతున్నారు. అసలుకే హాస్టల్స్​లో ఫుడ్​ పాయిజన్​ జరిగిన విద్యార్థులు అస్వస్థతకు గురివుతున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. 

192 హాస్టల్స్ కాంట్రాక్టు ఒక్కరికే...

జిల్లాలో కేజీబీవీ, మోడల్​ స్కూల్స్​ వరకే టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు, గు రుకులాలు, జనరల్​ హాస్టల్స్​లో కిరాణం సామాన్లకు టెండర్లు పిలవకుండా నామినేషన్​ పైనే కట్టబెట్టారు. నాణ్యమైన సరకులు సప్లై చేస్తారన్న న మ్మకంతో కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్​ రేట్లలో కోత పెట్టి మరీ కి రాణం సామాన్లకే ఎక్కువ రేట్లు నిర్ణయించారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ అని కాంట్రాక్టు అప్పగిస్తే దాన్ని బినామీల చేతుల్లో పెట్టారని, దాంతోనే నాసిరకమైన సామాన్లు సప్లై చేస్తున్నారని ఎస్​ఓలు ఆరోపిస్తు న్నారు. ఏదిఏమైనా దీని విచారణ జరిపిస్తే నిజాలు వెలుగులోకి వస్తా యని కోరుతున్నారు.

ఫిర్యాదులు వచ్చాయి 

కేజీబీవీ స్కూల్స్​కు పుచ్చిపోయిన బఠానీలు, ఇడ్లీ రవ్వ సప్లై చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. అయితే కాంట్రాక్టర్​ మావి కావు అని    అంటున్నరు. దీని పైన విచారణ చేస్తాం. ఆ తర్వాత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. నాణ్యమైన సరుకులు సప్లై చేయాలని  చెప్పాం...  – సరిత, జీసీడీఓ, నల్గొండ జిల్లా