ఇవ్వాళ బోధన్​కు కేబినెట్​ సబ్​కమిటీ .. కార్మికులు, రైతులతో మీటింగ్​

  • నిజాంషుగర్స్​ పునరుద్ధరణపై స్టడీ

నిజామాబాద్, వెలుగు: నిజాం షుగర్స్ ​ఫ్యాక్టరీల పునరుద్ధరణ అధ్యయనానికి మంత్రి శ్రీధర్​బాబు చైర్మన్​గా ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు శనివారం బోధన్​కు  రానున్నారు. ఉదయం 11 గంటలకు ఫ్యాక్టరీ ఆవరణలో కార్మికులు, రైతులతో కమిటీ మీటింగ్ ​నిర్వహిస్తారు. ఇందు కోసం మిల్లు ఆవరణలో టెంట్లు వేశారు. ఆర్డీవో రాజాగౌడ్ ​ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. 

చెరకు సాగు విషయంలో గవర్నమెంట్​ వైపు నుంచి ఎలాంటి సహకారం కావాలో రైతుల నుంచి తెలుసుకోవడానికి కమిటీ ప్రయార్టీ ఇస్తోంది. కార్మికులను విడిగా కలిసి వారి డిమాండ్లను తెలుసుకోనున్నారు.