కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్​ టీకే శ్రీదేవి బదిలీ

  • ఎస్సీ డెవలప్​​మెంట్​ కమిషనర్​గా నియామకం
  • ఆర్​అండ్​బీ స్పెషల్​ సీఎస్​గా వికాస్​ రాజ్
  • రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్​లు ట్రాన్స్​ఫర్ 

హైదరాబాద్, వెలుగు: కమర్షియల్​ ట్యాక్స్​ కమిషనర్​ టీకే శ్రీదేవిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఎస్సీ డెవలప్​మెంట్​ కమిషనర్​గా ఆమెను నియమించింది. కమర్షియల్ ​ట్యాక్స్​ కమిషనర్​గా అదే శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీగా ఉన్న రిజ్వీకి అదనపు బాధ్యతలను అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం శనివారం 8 మంది ఐఏఎస్​లను ట్రాన్స్​ఫర్ ​చేసింది.

ఈ మేరకు సీఎస్​ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వికాస్​ రాజ్​ కు ఇచ్చిన పోస్టింగ్​లో స్వల్ప మార్పులు చేశారు. రవాణా, ఆర్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ను నియమించారు. ఆర్​ అండ్​ బీ జాయింట్​ సెక్రటరీగా ఉన్న ఎస్​హరీశ్​ను  రెవెన్యూ (డిజాస్టార్ మేనేజ్మెంట్) జాయింట్ సెక్రటరీగా నియమించారు. మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ శాఖ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా ఉదయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. 

పురపాలక శాఖ డిప్యూటీ సెక్రటరీగా చెక్కా ప్రియాంక, హాకా ఎండీగా చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మార్కెట్‌‌‌‌‌‌‌‌ ఫెడ్‌‌‌‌‌‌‌‌ ఎండీగా శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డిని నియమిస్తూ సీఎస్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కమర్షియల్​ ట్యాక్స్​ కమిషనర్​ టీకే శ్రీదేవి బదిలీపై సెక్రటేరియెట్​ వర్గాల్లో చర్చ జరిగింది. కమర్షియల్​ ట్యాక్స్​లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల విషయంలో మాజీ సీఎస్​ సోమేశ్​కుమార్​పై  కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ టైంలో ఆమెను బదిలీ చేయడం ఐఏఎస్​ వర్గాల్లో చర్చకు దారితీసింది.

9 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి

9 మంది తహసీల్దార్లకు ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ ​సెక్రటరీ నవీన్​ మిట్టల్ ​శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అడహక్​ ప్రమోషన్లుగా పేర్కొన్నారు. పదోన్నతి పొందిన వారిలో  సీహెచ్.రామమూర్తి, టి.వెంకటేశం, కె.సుశీల, ఎం.జయమ్మ, ఏ యాదగిరి, ఎన్.నిర్మల, ఎల్.సుధా, సీహెచ్.విశాలక్షి, బి.గీత ఉన్నారు.