నేవీ​ ఉద్యోగాలకు ఎంపిక

కొత్తపల్లి, వెలుగు: ఇండియన్​ నేవీ ఎస్ఎస్ఆర్​ ఉద్యోగాలకు కొత్తపల్లి పట్టణంలోని తేజస్ డిఫెన్స్​ అకాడమీ విద్యార్థులు ఎంపికైనట్లు కాలేజీ చైర్మన్​ సీహెచ్ సతీశ్‌‌‌‌రావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను బుధవారం ఆయన అభినందించారు. అనంతరం మాట్లాడుతూ జులైలో జరిగిన ఎగ్జామ్ రిజల్ట్స్​ఇటీవల విడుదల కాగా తమ కాలేజీ నుంచి 10 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు చెప్పారు. ఇప్పటివరకు తమ కాలేజీ నుంచి 2వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు చెప్పారు.