మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

 వెలుగు, నెట్​వర్క్​ : యువత  మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో డ్రగ్స్​, గంజాయిని నిర్మూలించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్లు, ఎస్పీలు కోరారు. బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు, పోలీసులు ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.  

కరీంనగర్​లోని   శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి  కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు.  గోదావరిఖని లో  రామగుండం పోలీస్ కమిషనర్  ఎం.శ్రీనివాస్  ,  జగిత్యాలలో ఎస్పీ అశోక్ కుమార్  ,  సిరిసిల్లలో  ఎస్సీ అఖిల్ మహాజన్ , అడిషనల్ కలెక్టర్ చందయ్య  ఆధ్వర్యంలో పోలీసులు ర్యాలీలు నిర్వహించారు.  అనంతరం డ్రగ్స్​ నివారణకు కృసి చేస్తామని ప్రతిజ్ఞలు చేశారు. కేశవపట్నం, రాయికల్​, కోరుట్ల, జమ్మికుంటలో  అధికారులు విద్యార్థులు కాలేజీల్లో, స్కూళ్లలో అవగాహన కల్పించారు.